టిక్ టాక్ వీడియో చేసి ఉరి వేసుకున్న భర్త 

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 09:36 AM IST
టిక్ టాక్ వీడియో చేసి ఉరి వేసుకున్న భర్త 

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో చేసి అనతరం ఆత్మహత్యకు యత్నించాడు. విజయ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతున్నానంటూ టిక్ టాక్ వీడియో చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననీ..కానీ  తన భార్యను ఆమె తల్లిదండ్రులు..బంధువులు బలంతంగా తననుంచి వేరు చేసి తీసుకెళ్లిపోయారని టిక్ టాక్ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశాడు. 

తన భార్య లేకుండా ఉండలేనని మనస్థాపంతో చనిపోతున్నానంటూ వీడియోలో తెలిపి తరువాత విజయ్ కుమార్ ఉరి వేసుకున్నాడు. దీంతో విజయ్ కుమార్ పరిస్థితి విషయమించటంతో స్థానికులు వెంటనే కాకానాడలోని జీజీహెచ్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

వివరాలు..మండపేటకు చెందిన విజయ్ రాపాకకు చెందిన లావణ్య అనే యువతిని ప్రేమించాడు. ఐదు రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని లావణ్య బంధువులు ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ ఆత్మహత్యకు యత్నించడు.తన  చావుకు కారణమైనవారి పేర్లు కూడా రాసి పెట్టాడు.  దీనికి సంబంధించి టిక్ టాక్ వీడియో చేసి  పోస్ట్ చేశారు. ఆ వీడియో లావణ్యకు చేరే వరకూ షేర్ చేయమని కోరాడు.

తాను చనిపోయాక తన శవాన్ని లావణ్యకు చూపించాలని కూడా విజ్నప్తి చేశాడు. లావణ్య అక్కా..బావ కలిసి తననుంచి లావణ్యను దూరం చేశారని..వారే నా ఆత్మహత్యకు కారణమని తెలిపాడు. ఈ టిక్ టాక్ సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.