జంబలకిడి పంబ : పెళ్లి కొడుకుకే తాళి కడతారు

సాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది శ్రీకాకుళం జిల్లాలోని నువ్వలరేవు గ్రామం.

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 07:17 AM IST
జంబలకిడి పంబ : పెళ్లి కొడుకుకే తాళి కడతారు

సాధారణంగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో తాళి కడతాడు..కానీ ఇక్కడ అంతా రివర్స్..అంతేకాదండోయ్..వింత ఆచారాలతో గ్రామంలో సుమారు వంద వివాహాలు రెండేళ్లకు ఒకసారి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత..అనాదిగా కొనసాగుతోంది.ఆచారానికి నాంది పలికింది శ్రీకాకుళం జిల్లాలోని నువ్వలరేవు గ్రామం.

నువ్వుల రేవు : వివాహాలలో ఎన్నో రకాలు..మరెన్నో సంప్రదాయాలు..భిన్న రీతులు..విభిన్న సంప్రదాలయ కలయికే భారతావని. జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ వివాహాలు ఆయా సంప్రదాయాల ప్రకారంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో మనం ఓ విచిత్రమైన సంప్రదాయ వివాహాల గురించి తెలుసుకుందాం. 

 

పెళ్లి అంటేనే సందడి..బంధువులు..స్నేహితులు..శ్రేయోభిలాషులు అందరు కలిసి వధూవరులను ఒకటిగా చేస్తారు. విషయం ఏమిటంటే..పెళ్లిలో  మూడు ముళ్లు.. ఏడడుగుల సంప్రదాయం ఎక్కడా కనిపించదు.పెళ్లి కూతురే.. వరుడి మెడలో తాళి కడుతుంది. జంబలకిడి పంబ సినిమా గుర్తు కొస్తోంది కదూ.. అదే ఇక్కడ స్పెషల్. అంతేకాదు.. ఈ గ్రామంలో రెండేళ్లకు ఒకసారి మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ ఆచారానికి నాంది పలికింది శ్రీకాకుళం జిల్లా  నువ్వలరేవు గ్రామం. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం అనగానే గుర్తుకొచ్చేది సామూహిక వివాహాలు. ఈ వివాహాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే కదిలి వస్తుంది అంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కట్నకానుకలు.. జరిగే విధానం అంతా స్పెషలే..
కట్నకానుకల కింద నగలు, నగదు ఇవ్వరు. వధూవరులు బతకటానికి ఏడాదికి సరిపడా బియ్యం, ఇతర సరుకులు ఇస్తారు. అత్తారింటికి పట్టుకెళ్లేది వీటినే. అతిధులకు చుట్ట, బీడి, పాన్‌పరాగ్‌ ఇచ్చి స్వాగతం చెబుతారు. వివాహం నిశ్చయించిన రాత్రి నుంచి గ్రామంలో ఏ వీధిలో చూసినా వివాహాలే జరుగుతుండడం ముచ్చటగా ఉంటుంది. గ్రామమంతా పెళ్లిపందిళ్లు, టెకరేషన్స్ తో కళ్లు మిరమిట్లుగొల్పేలా ఉంటుంది. రెండేళ్ల కిందట జరిగిన నువ్వలరేవు సామూహిక వివాహ వేడుకలకు సాక్షాత్తు కలెక్టర్‌, ఎస్పీలు సకుటుంబంగా అతిథులుగా వచ్చి వివాహం చేసుకున్న దంపతులను పట్టువస్త్రాలతో అభినందించి వారిని ప్రోత్సహించారు.
 

సామూహిక వివాహాల వెనకో కథ..
వజ్రపుకొత్తూరు మండలంలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువ. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తారు. అక్షరాస్యతకు దూరంగా ఉన్నారు. సంపాదన నామమాత్రమే.. దీంతో దశాబ్దాల కిందట నువ్వలరేవు గ్రామంలో పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి.. ఒకేసారి వివాహాలు చేయడం, బంధువులకు సామూహికంగానే భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చుతగ్గుతుందని భావించారు. అలా వచ్చిందే ఈ సామూహిక వివాహాల ఆలోచన. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ అదే పాటిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు నువ్వులరేవు  ప్రజలు. గ్రామంలో అధిక జనాభా ఉండడంతో సామూహిక వివాహాలకు అనువైన వేదికగా మారింది.