చికిత్స కోసం యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్లిన గ్రామస్తులు 

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 08:09 AM IST
చికిత్స కోసం యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్లిన గ్రామస్తులు 

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. వైద్యం కోసం కిలోమీటర్ల మేర రోగులను మోసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఆస్పత్రులు లేక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం దుంగాడ గ్రామానికి చెందిన నాగరాజు అనే గిరిజన యువకుడు పచ్చకామెర్లతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో ఆ యువకుడిని 15 కిలో మీటర్లు డో లిలో తీసుకొచ్చి ఎస్ కోట ఆస్పత్రిలో చేర్పించారు.

doli

పరిస్థితి విషమించడంతో వైద్యులు విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. రహదారులు లేకపోవడం, గిరిజనుల గ్రామాలు అటవీప్రాంత సమీపంలో ఉండటంతో వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.