అదృష్టవంతుడు : 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువకుడు

ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి

  • Published By: veegamteam ,Published On : September 15, 2019 / 06:34 AM IST
అదృష్టవంతుడు : 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువకుడు

ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి

ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి అంటారు. మన సంగతి అటుంచితే.. ఆ యువకుడు మాత్రం నిజంగా అదృష్టవంతుడే. నక్క తోక తొక్కాడేమో అని అనక తప్పదు. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలకు అతడు సెలెక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆ యువకుడి పేరు రాయుడు త్రిమూర్తులు. వయసు 27. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామ నివాసి. రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ సత్తా చాటాడు. 5 నెలల కాలంలో ఏకంగా 4 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సివిల్ ఎస్ఐగా, ఆంధ్రప్రదేశ్ సివిల్ కానిస్టేబుల్ గా, దక్షిణ మధ్య రైల్వేలో లోకో అసిస్టెంట్ పైలెట్ గా, రైల్వే గ్రూప్-డి పోస్టుకు సెలెక్ట్ అయ్యాడు.

త్రిమూర్తులు తండ్రి ఏసుబాబు రైతు. తల్లి నాగలక్ష్మి గృహిణి. త్రిమూర్తులు చిన్నప్పటి నుంచి విద్యలో ప్రతిభ కనబరిచాడు. టెన్త్ వరకు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ లో చదివాడు. పిఠాపురంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివాడు. చేబ్రోలులోని ఆదర్శ్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్(మెకానికల్) చదివాడు. 2013లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ లో చేరాడు. జాబ్ చేస్తూనే ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాడు. 2017 నుంచి పోటీ పరీక్షలు రాసేందుకు శిక్షణ పొందాడు. 2019 మార్చి నుంచి ఇప్పటి వరకు వెలువడిన 4 పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉద్యోగాలు పొందేందుకు అర్హత సాధించాడు. ఒకేసారి ఇన్ని కొలువులకు ఎంపికైన త్రిమూర్తులును తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. కాగా, పోలీసు ఉద్యోగం అంటే ఇష్టమని చెప్పిన త్రిమూర్తులు… ఎస్ఐగా చేరతానని తెలిపాడు.