కుక్కగారి క్యూరియాసిటీ : గోడ అవతల ఏముందో తెలుసుకోవాలని.. ఏం చేసిందో చూడండి

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 04:46 AM IST
కుక్కగారి క్యూరియాసిటీ : గోడ అవతల ఏముందో తెలుసుకోవాలని.. ఏం చేసిందో చూడండి

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే ఔరా..అనిపిస్తాయి..ఇంకొన్ని ఇటువంటి ఐడియాలో ఎలా వస్తాయబ్బా..! అనిపిస్తాయి. అటువంటిదే ఈ శునకం చేసిన విన్యాసం. గోడ అవతల ఏముందో చూడాలనుకుంది ఓ కుక్క..కానీ అంత ఎత్తు గోడ ఎక్కలేనని తెలిసింది. కానీ గోడ అవతల ఏముందో…అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకునే కుతూహలాన్ని మాత్రం వదులుకోలేకపోయింది. ఏమైనా సరే గోడ అవతలకు చూడాలనుకుంది.

ఎలాగంటే..కుక్కలు గోడ ఎక్కడం పెద్ద వింతా కాదు విశేషమూ కాదు. కానీ ఓ కుక్క చెట్టునీ..గోడను ఒకేసారి ఎక్కటం మాత్రం కచ్ఛితంగా వింతే..విశేషమే అనక తప్పదు. గోడ అవతలకు చూడాలనుకున్న సదరు కుక్కగారు..గోడపై ముందు కాళ్లు పెట్టింది. వెనక కాళ్లను అక్కడే ఉన్న ఓ కొబ్బరి చెట్టుపై పెట్టి బ్యాలన్స్ చక్కగా కుదుర్చుకుంది. 
ఆ తరువాత దాని తెలివితేటలు చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. ముందు కాళ్లను కొంచెం పైకి లేపి గోడకు సపోర్ట్ చేసుకుంది. తరువాత వెనక కాళ్లను  చెట్టుపై పైకి పెట్టుకుంది. ఇలా క్రమంగా గోడ చివరకు చేరుకుని మొత్తానికి గోడ అవతలకు తొంగి చూసింది. 

ఇంత కష్టపడి ఎక్కింది కదా..కాసేపు అక్కడ ఉందా అంటే లేదు. చూసిన వెంటనే ఠక్కుమని కిందకు దూకేసి చక్కపోయింది. గోడ అవతలకు చూసేందుకు ఆ కుక్క చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కర్నీ నవ్విస్తోంది. ఈ వీడియోని పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా… ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనుషులు ఎలాగైతే ఆలోచిస్తారో అచ్చు అలాగే కుక్క కూడా ఆలోచించింది. గోడ ఎక్కడం చేతకాక… వెనక కాళ్లతో చెట్టు ఎక్కుతూ, ముందుకాళ్లతో గోడ ఎక్కవచ్చనే ఐడియా  దానికి భలే వచ్చిందే…అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇటువంటి వీడియో సోషల్ వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. 1800 మంది లైక్ చేశారు. 26000కు పైగా వ్యూస్ వచ్చాయి. 320 మంది రీట్వీట్ చేశారు. ప్రతీ ఒక్కరూ కుక్కగారి ఐడియా  భలే ఉందే అంటున్నారు.