Man Jumps Off Motorcycle పసి పిల్లాడిని కాపాడిన రియల్ హీరో

Man Jumps Off Motorcycle పసి పిల్లాడిని కాపాడిన రియల్ హీరో

పిల్లలను సురక్షితంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చిన్న పిల్లలను బయటకు తీసుకొచ్చినప్పుడు  ఇంతకముందులా ఎత్తుకోకుండా.. బేబీ వాకర్లలో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకొస్తున్నారు. అయితే అలా తీసుకుని వెళ్లగానే సరిపోదు. వారిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఓ సంఘటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.



ఒక తల్లి తన బిడ్డను వాకర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకువచ్చింది. అసలు ఏమైందో తెలియదు కానీ ఓ స్ట్రీట్ నుంచి బిడ్డ ఉన్న వాకర్ వేగంగా కిందకు వస్తుండగా… అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వస్తున్నాడు. వేగంగా రోడ్ మీద జారిపోతున్న బిడ్డను చూసి.. ఆ బైక్ పై వస్తున్న వ్యక్తి క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ మీద నుంచి దూకి బిడ్డను పట్టుకోవటానికి పరిగెత్తాడు. చివరికి ఆ బిడ్డను సురక్షితంగా రక్షించగలిగాడు. వెనకాల పరిగెడుతూ వచ్చిన తల్లికి ఆ బిడ్డను కాపాడి సురక్షితంగా ఇచ్చాడు.



వార్తా సంస్థల ప్రకారం, ఈ సంఘటన సెప్టెంబర్ 14న కొలంబియాలోని ఫ్లోరెన్సియా నగరంలోని రింకన్ డి లా ఎస్ట్రెల్లా పరిసరాల్లో జరిగింది. పక్కనే ఉన్న CCTV ఫూటేజ్ లో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను 1.7 మిలియన్లకు పైగా వీక్షించారు.