వైరల్ : 4 నెలలో 26 కేజీల బరువు తగ్గిన సానియా మీర్జా

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 11:22 AM IST
వైరల్ : 4 నెలలో 26 కేజీల బరువు తగ్గిన సానియా మీర్జా

భారతీయ టెన్నిస్ సార్ట్ హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా  తన పూర్వ లుక్ లోకి మారటం కోసం ఎంతో శ్రమించి బరువు తగ్గిన ఫోటోను  ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళ్లితే.. ఓ బిడ్డకు జన్మిచ్చిన తర్వాత మీర్జా తన బరువును తగ్గించుకోవటం కోసం ఎంతో ప్రయత్నించింది. 89 కిలోల బరువున్న ఆమె 63 కిలోలకు వచ్చినట్లు చెప్పింది. తనకి 26 కేజీలు బరువు తగ్గటానికి 4 నెలల సమయం పట్టిందని తెలిపింది. బిడ్డ పుట్టాక తను ఆరోగ్యంగా ఉన్నాడని, తిరిగి తాను ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టి బరువు తగ్గటం ఎంతో ఆనందంగా ఉందని  ఆమె తెలిపింది.

 

‘నేను చేయగలిగాను అంటే మీరు కూడా చేయగలరు’ అనే క్యాప్షన్ తో  సానియా పోస్ట్ చేశారు. మీరు కూడా మీపై నమ్మకం ఉంచి మీ కలలను సాకారం చేసుకుని, ఉన్నత స్ధాయికి చేరుకోండి అంటూ పోస్ట్ చేసింది. 

ఇప్పటివరకు ఈ పోస్టుకు లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన   నెటిజన్స్…  మీరు ఎప్పుడు విజేతగానే ఉంటారు, నీజాయితీగా బరువు తగ్గి చూపించారు, అందరికి స్పూర్తిగా నిలుస్తారు అంటూ కామెంట్స్ చేసారు.