జాతీయం

తెలంగాణ రాష్ట్రంతో పాటు రాజస్థాన్‌లోనూ కీలక ఘట్టానికి తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే.

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి.

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు.

కర్ణాటక : హెచ్ఐవీ రోగులంటే సమాచారంలో ఏహ్యభావం ఏర్పడిపోయింది. వారికి దూరంగా వుండటమే కాక వారిపై అంతులేని వివక్ష కొనసాగుతోంది. వారు బ్రతికి వుండగానే కాదు మరణానంతరం కూడా ఇటువంటి ఘోరమైన వివక్ష  జరగుతుండటం అత్యంత దారుణం, బాధాకరం.

ఢిల్లీ: అన్ని వాహనాలకు ‘హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ప్లేట్ల(హెచ్‌ఎ్‌సఆర్‌పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఢిల్లీ : పెట్రోల్ ధరలకు, దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధమేంటి? దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగిన సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గుతాయి? ఎన్నికలు ముగిసాక మళ్లీ ధరలు ఎందుకు పెరుగుతాయి?

ఢిల్లీ : వాహన దారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా బంపరాఫర్ ఇచ్చింది. బీమ్ కార్డు ద్వారా బంకుల్లో మొదటిసారి రూ.100 విలువైన పెట్రోల్ కొట్టించుకుంటే.. 5 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటు SBI ప్రకటించింది.

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ప్రకటించిన ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార పర్వానికి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలకు  తెరపడింది. దీంతో పార్టీల మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల ప్రచార రధాలకు బ్రేకులు పడ్డాయి.

జర్మనీ : ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ బైక్ రోడ్డెక్కింది. నెరా పేరుతో తయారైన ఈ త్రీడీ బైక్ ను బిగ్ రెప్, నౌలబ్ అనే జర్మన్ కంపెనీలు రూపొందించాయి. నెరా త్రీడీ బైక్ రోడ్డుపై పరుగులు పెట్టింది.

Pages

Don't Miss