Lok Sabha Polls 2024 : ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. 13 రాష్ట్రాల్లో 89లోకసభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్..!

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

Lok Sabha Polls 2024 : ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. 13 రాష్ట్రాల్లో 89లోకసభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్..!

Lok Sabha Polls 2024 _ Phase 2 Campaigning Ends For 13 States of 89 Seats

Lok Sabha Polls 2024 : సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మొత్తం 13 రాష్ట్రాలు, 89 లోక్ సభ స్థానాల్లో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించాయి. అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు విమర్శలకు ప్రతి విమర్శలతో ప్రచారంలో దూసుకెళ్లాయి. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా శ్రమించారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24తో రెండో విడత ప్రచారానికి తెరపడింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుందంటే? :
లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలో 20 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. కర్ణాటక 14, రాజస్థాన్ 13, ఉత్తర్ ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకాశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగనుంది.

Read Also : Visakhapatnam North Assembly Race Gurralu : ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్‌.. ఈసారి అక్కడ ఎగిరే జెండా ఏది?