జాతీయం

ఢిల్లీ: ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారా? మరి మీ మొబైల్ నెంబర్‌ రిజిస్టర్ చేసుకున్నారా? లేదా? లేకుంటే మాత్రం మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం బ్లాక్ అవడం ఖాయం.

కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను ముక్కలు చేయాలని మలయాళ నటుడు కొల్లం తులసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

అమరావతి: తిత్లీ తుఫాను బాధితులను ఆదుకొనేందుకు... పునరావాస ఏర్పాట్లు చేసేందుకు తక్షణం రూ.1200 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.

ముంబయి : ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి (92) కున్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌ కెనడీ ఆస్పత్రిలో పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు.

ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది. ఓ బ్యాంకులో ప్రవేశించిన ఆరుగురు దుండగులు రూ. 3 లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో క్యాషియర్‌ను దుండగులు కాల్చి చంపారు. బ్యాంకుల్లో ఉన్న ఇతరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ముంబయి: ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా పొందాలంటే ఎస్బీఐ వినియోగదారులు తప్పనిసరిగా మొబైల్ నెంబరును మీ అకౌంట్‌కు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీ : ఏపీ ఎంపీలు కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం మరింత ఉధృతం చేశారు. గతంలో ఎంపీ సీఎం రమేశ్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

చెన్నై:తమిళనాడులో రోడ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో అవకతకలు జరిగాయనే ఆరోపణలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణ జరపాలని చెన్నై హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ‘‘#మీ టూ’’ స్పందనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసుల విచారణకు నలుగురు సభ్యుల విశ్రాంత న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర మంత్రి  మేనకా గాంథీ శుక్రవారం ప్రకటించారు. 

ఢిల్లీ : తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదన్నారు. ఢిల్లీలో ప్రజా గాయకుడు గద్దర్ రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడారు. సోనియమ్మను చూడటానికే ఢిల్లీకి వచ్చానని తెలిపారు.

Pages

Don't Miss