స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి
వేసవికాలంలో స్విమ్మింగ్ పూల్లకు మంచి క్రేజ్ ఉంటుంది. మరి అంతేస్థాయిలో నిర్వహణ కూడా ఉండాలి కదా. కానీ, హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ ఐదేళ్ల చిన్నారి బలైపోయింది.
స్విమ్మింగ్ పూల్‌కు ఈత నేర్చుకుందామని వచ్చిన చిన్నారి అదుపుతప్పింది. కానీ, కోచ్, పక్క సిబ్బంది గమనించలేదు. చాలాసేపటి తర్వాత తేరుకుని బాలికను పైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందించడం మొదలుపెట్టినా.. కాపాడుకోలేకపోవడంతో మార్చి 27 బుధవారం మృతి చెందింది.
ఆల్వాల్ ప్రాంతంలోని ఆ స్విమ్మింగ్ పూల్ మేనేజ్మెంట్, కోచ్‌లపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.