‘గుడ్ లక్ సఖి’ వస్తోంది!..
Good Luck Sakhi: ‘మహానటి’తో జాతీయ అవార్డునందుకున్న కీర్తి సురేష్ ఒక వైపు కథానాయికగా సినిమాలు చేస్తూనే.. పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెండ్ సినిమాల్లోనూ నటిస్తోంది.
జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుడ్ లక్ సఖి’ మూవీలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా కనిపించనుంది. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
జగపతిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో కనిపిస్తే.. కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. జూన్ 3న ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల ముందుకురానుంది. రమాప్రభ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.