పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన భారత్!

పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన భారత్!

నిరంతరం ఏదో ఒకచోట కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ ప్రశాంతత లేకుండా చేస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శల దాడికి దిగింది. మానవ హక్కుల సమాఖ్య వేదికగా పాకిస్తాన్‌పై ఇండియా విరుచుకుపడింది. 46వ సెషన్‌లో జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది.

టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఆరోపణలు చేసింది. జమ్మూకశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. తమ దేశ పరిస్థితుల గురించి మాట్లాడే హక్కు పాక్‌కు లేదని స్పష్టం చేసింది.

మానవ హక్కులను ఉల్లంఘించి ఘోరమైన తప్పులు చేస్తొన్న పాకిస్తాన్.. వాటిపై నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఖజానా నుంచి ప్రావిడెంట్ ఫండ్ అందిస్తోందని భారత్ ఆరోపించింది. ఇలా ఎన్నోసార్లు మానవ హక్కులను ఉల్లంఘించిన పాకిస్తాన్.. ఆ విషయాలను కప్పిపెట్టుకోవడానికి తమపై లేనిపోని అభాండాలు వేస్తోందని భారత్ విమర్శలు గుప్పించింది.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలత ప్రాంతంగా మార్చడంపై గతంలో కూడా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. ఐరాస మాత్రం పాకిస్తాన్ రిక్వెస్ట్‌లను ప్రతిసారి తొసిపుచ్చింది. కానీ బుద్ధి మార్చుకోవట్లేదు పాకిస్తాన్. మరోసారి కశ్మీర్ ప్రస్తావన తీసుకురాగా.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.