విజయవాడలో విషాదం.. ఇంట్లో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Vijayawada: బలవన్మరణమా? లేక హత్యా? అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు.

విజయవాడలో విషాదం.. ఇంట్లో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Updated On : April 30, 2024 / 1:00 PM IST

విజయవాడలోని గురునానక్ నగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. డాక్టర్,  శ్రీజ హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ తన ఇంటి బయట ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆ డాక్టర్ కుటుంబ సభ్యుల మృతదేహాలు కూడా ఇంట్లో కనపడ్డాయి. బలవన్మరణమా? లేక హత్యా? అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు.

ఘటనాస్థలికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ వచ్చి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో విచారణ జరుగుతోంది. డాక్టర్ ఇంట్లో మృతి చెందినవారు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంతకుముందు కుటుంబ సభ్యులను‌ చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుల వివరాలు

  • డాక్టర్ శ్రీనివాస్ (40)
  • ఉషారాణి (36)
  • శైలజ (9)
  • శ్రీహాన్ (5)
  • శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)

Also Read: నా ఫేక్ వీడియో వెనుక ఆయన హస్తం ఉంది: అమిత్ షా