చెక్ చేసుకోండి : ప్లే స్టోర్స్‌లోకి TikTok వచ్చేసింది

టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో ఈ యాప్ మళ్లీ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 10:36 AM IST
చెక్ చేసుకోండి : ప్లే స్టోర్స్‌లోకి TikTok వచ్చేసింది

టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో ఈ యాప్ మళ్లీ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది.

టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో ఈ యాప్ మళ్లీ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది. భారత్ లో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో బుధవారం( మే 1,2019) అందుబాటులోకి వచ్చింది. ఇక యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మద్రాస్ హైకోర్టు నిషేధం విధించడంతో 15 రోజులుగా ఈ యాప్ అందుబాటులో లేకుండా పోయింది.
Also Read : ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

ఆ తర్వాత కొన్ని షరతులతో మద్రాస్ హైకోర్టు బ్యాన్ ఎత్తివేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల తర్వాత టిక్ టాక్ యాప్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్ టాక్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. భారత్ లో లాంచ్ అయిన షార్ట్ టైమ్ లోనే పెద్ద సంఖ్యలో యూజర్లు చేరారు.

టిక్ టాక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ యాప్ యువతను తప్పుదారి పట్టిస్తోందని, అశ్లీలతను పెంచడంతో పాటు విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపణలు వచ్చాయి. పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని మధురైకి చెందిన ముత్తు కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తూ ఏప్రిల్ 3న తీర్పు ఇచ్చింది. భారత్‌లో ఏప్రిల్ 15 నుంచి టిక్ టాక్ యాప్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు కూడా ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్‌‌ను తొలగించాయి.

ఏప్రిల్ 16 నుంచి ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేకపోయింది. చైనాకు చెందిన బైట్‌ డ్యాన్స్ సంస్థ నిషేదాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మద్రాస్ హైకోర్టు కొన్ని షరతులతో టిక్ టాక్ యాప్ పై ఉన్న బ్యాన్ ని ఏప్రిల్ 24న ఎత్తివేసింది. నిషేధం ఎత్తివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన వారం రోజుల తర్వాత.. అంటే బుధవారం (మే 1, 2019) నుంచి టిక్ టాక్ యాప్ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది.
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

ప్రముఖ వీడియో యాప్ టిక్ టాక్ తిరిగొచ్చాక మరింత రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ వన్ ల్యాక్ డౌన్ లోడ్స్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ అంటే ఏంటో తెలియని వాళ్లు కూడా  బ్యాన్ కారణంగా దాని గురించి విన్నారు. అసలు టిక్ టాక్ ఎలా ఉంటుందో చూద్దామని ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాన్ కారణంగా బ్యాడ్ నేమ్ వస్తుందని, టిక్ టాక్ కు ఆదరణ తగ్గిపోతుందని, తమ  బిజినెస్ డౌన్ అవుతుందని కంపెనీ యాజమాన్యం భయపడింది. అందుకు విరుద్ధంగా టిక్ టాక్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఒక్కసారిగా బిజినెస్ పెరగడంతో కంపెనీ యాజమాన్యం ఫుల్  ఖుషీగా ఉంది. దేశంలో 3కోట్ల మందికి వినోదాన్ని, కాలక్షేపాన్ని ఇస్తున్న టిక్ టాక్ యాప్ మళ్లీ ప్రాణం పోసుకోవడంతో యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.