ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఐకానిక్ బ్లూ కలర్ మారబోతోంది. వచ్చే కొన్ని నెలల్లో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై బ్లూ కలర్ ఇక కనిపించదు. ఫేస్ బుక్ యాప్, డెస్క్ టాప్ సైట్ కంప్లీట్ గా రీడిజైన్ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : May 1, 2019 / 08:47 AM IST
ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఐకానిక్ బ్లూ కలర్ మారబోతోంది. వచ్చే కొన్ని నెలల్లో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై బ్లూ కలర్ ఇక కనిపించదు. ఫేస్ బుక్ యాప్, డెస్క్ టాప్ సైట్ కంప్లీట్ గా రీడిజైన్ చేయనుంది.

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఐకానిక్ బ్లూ కలర్ మారబోతోంది. వచ్చే కొన్ని నెలల్లో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై బ్లూ కలర్ ఇక కనిపించదు. ఫేస్ బుక్ యాప్, డెస్క్ టాప్ సైట్ కంప్లీట్ గా రీడిజైన్ చేయనుంది. బ్లూ కలర్ స్థానంలో మొత్తం వైట్ కలర్ కనిపించనుంది. యానివల్ F8 డెవలపర్ కాన్ఫిరెన్స్ లో  ఫేస్ బుక్ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫేస్ బుక్ తమ కోర్ ప్రొడక్టుల్లో మార్పులు చేయనున్నట్టు వెల్లడించింది. ఫేస్ బుక్ మెసేంజర్ డెస్క్ టాప్ యాప్ ను విండోస్, మ్యాక్ సిస్టమ్ లో ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గ్రూపు వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ను టెస్టింగ్ చేస్తుండగా.. ఏడాది ఆఖరిలో రిలీజ్ చేయనున్నారు.  
Also Read : చెక్ చేసుకోండి : ప్లే స్టోర్స్‌లోకి టిక్‌ టాక్ వచ్చేసింది

యూజర్ల ప్రైవసీపై స్పెషల్ ఫోకస్ :
ఫేస్ బుక్ ప్రధాన యాప్ మెసేంజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సర్వీసుల్లో యూజర్ల ప్రైవసీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడంతో సంస్థ ఫేస్ బుక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రైవసీ ఇష్యూపై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)ఫేస్ బుక్ పై 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. ఈ క్రమంలో ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంపై మరిన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. కంపెనీ సీఈఓ జూకర్ బర్గ్ సైతం ఈ ఫేస్ బుక్ ప్రైవసీ ఇష్యూపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫేస్ బుక్ సైట్ కంప్లీట్ కలర్ రీడిజైన్ చేయనున్నట్టు F8 కాన్ఫిరెన్స్ లో ప్రకటించారు. 
Facebook drops iconic blue in redesign to be changed soon

గ్రూప్స్.. సైట్ లేఔట్ కంప్లీట్ వైట్ :
ఎన్నోఏళ్లుగా యూజర్లను ఐకానిక్ బ్లూ కలర్ ఎంతో ఎట్రాక్ట్ చేసింది. బ్లూ కలర్ డిజైన్ చూడగానే ఫేస్ బుక్ లోగో, ఐకాన్లు యూజర్లకు ఫీల్ గుడ్ అనిపించేలా ఉండేవి. ఇకపై ఫేస్ బుక్ మొబైల్ యాప్, డెస్క్ టాప్ సైట్ మెనూ బార్ కలర్ కంప్లీట్ గా వైట్ కలర్ లోకి మారిపోనుంది.  వైట్ స్పేస్ తో ఉండి క్లియర్ వైట్ లైన్స్ తో కనిపించనుంది. ప్రస్తుతం ఫేస్ బుక్ యూజర్లు 400 మిలియన్లకు పైగా ఉండగా.. యాక్టివ్ గ్రూపు యూజర్లు 10 మిలియన్ల మంది ఉన్నారు. ఫేస్ బుక్ కొత్త డిజైన్ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తుందో లేదో చూడాలి. కంప్లీట్ వైట్ బ్యాగ్ గ్రౌండ్ ఉండటంతో యూజర్లకు ఎంతమేరకు నచ్చుతుందో చూడాలి. ఫేస్ బుక్ రీడిజైన్ కొత్త లుక్ ఇదే.. 
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

కొత్త డిజైన్ ఇలా : 
* ఫేస్ బుక్ లాగిన్ పేజీ.. కంప్లీట్ గా వైట్ కలర్ లో కనిపించనుంది. 
* ఫేస్ బుక్ లోగో కలర్ లైట్ బ్లూ కలర్ వైట్ బ్యాగ్ గ్రౌండ్, రో ఐకాన్స్  
* లెఫ్ట్ లేబుల్ హోం కేటగిరీ కనిపించనుంది. 
* రైట్ సైడ్ లేబుల్ లో సజెస్టడ్ గ్రూప్స్, కాంటాక్ట్స్ కనిపిస్తాయి. 
* న్యూస్ ఫీడ్ లో కంటెంట్ కూడా వైట్ బ్యాగ్ గ్రౌండ్ పైనే కనిపిస్తాయి. 
* ఫేస్ బుక్ గ్రూప్స్ పేజీల్లో కూడా కంప్లీట్ వైట్ బ్యాగ్ గ్రౌండ్. 
* న్యూస్ ఫీడ్ మధ్యలో యాడ్ ఏ పోస్ట్ కనిపిస్తుంది.  
* జాయిన్, యాడ్ టూ ఫ్రెండ్ ఆప్షన్లు కూడా వైట్ కలర్ లోనే 
* టెక్ట్స్ కలర్.. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపించనుంది.