IPL 2021 : CSK vs RR : రాజస్థాన్ లక్ష్యం 189..
ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అతికష్టంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
IPL 2021 : CSK vs RR : ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అతికష్టంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. టాస్ ఓడి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై పరిమిత స్కోర్లను సాధించి పర్వాలేదనిపించింది. ఫలితంగా రాజస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
డుప్లెసిస్(17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్) 33 పరుగులు చేయగా.. మొయిన్ అలీ(26; 20 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సులు), అంబటి రాయుడు(27; 17 బంతుల్లో 3సిక్స్ లు), సురేశ్ రైనా(18; 15 బంతుల్లో 1ఫోర్ 1సిక్స్), ధోనీ(18; 17 బంతుల్లో 2ఫోర్లు), బ్రావో(20 నాటౌట్; 8 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.
రాజస్థాన్ బౌలర్లలో సకారియా 3 వికెట్లు తీసుకోగా, మోరిస్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ ఒక వికెట్, రాహుల్ తెవాతియా ఒక వికెట్ పడగొట్టారు.