సాహో : బేబి వోంట్ యూ టెల్ మి – వీడియో సాంగ్
సాహో నుండి 'బేబి వోంట్ యూ టెల్ మి' వీడియో సాంగ్ రిలీజ్.. ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది..

సాహో నుండి ‘బేబి వోంట్ యూ టెల్ మి’ వీడియో సాంగ్ రిలీజ్.. ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ వివిధ ప్రాంతాలకు వెళ్లి పలు మీడియా సంస్థలతో సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. రీసెంట్‌గా సాహో నుండి ‘బేబి వోంట్ యూ టెల్ మి’ అనే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది.
‘కలిసుంటే నీతో ఇలా.. కలలాగే తోచిందిగా.. తలవంచి ఆకాశమే నిలిచుందా నా కోసమే.. కరిగిందా ఆ దూరమే.. వదిలెళ్లా నా నేరమే.. నమ్మింకా నన్నే ఇలా.. తీరుస్తా నీ ప్రతి కలా’.. అంటూ సాగే సాంగ్ లిరికల్స్ బాగున్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. ప్రభాస్, శ్రద్ధల కెమిస్ట్రీ పాటకే హైలెట్‌గా నిలిచింది.. శంకర్ ఎహసాన్ లాయ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, కృష్ణకాంత్ లిరిక్స్ రాసాడు. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడారు. ఇటీవలే సాహో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
Read Also : అఖిల్‌తో పూజా హెగ్డే..
తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : మది, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కణ్ణన్.