అఖిల్‌తో పూజా హెగ్డే

అఖిల్ అక్కినేని.. బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే..

  • Published By: sekhar ,Published On : August 26, 2019 / 07:28 AM IST
అఖిల్‌తో పూజా హెగ్డే

Updated On : May 28, 2020 / 3:43 PM IST

అఖిల్ అక్కినేని.. బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే..

Mr.మజ్ను తర్వాత అఖిల్ అక్కినేని.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెం:5గా రూపొందతున్న ఈ సినిమాను బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ కోసం గతకొద్ది రోజులుగా మూవీ టీమ్ ప్రయత్నాలు చేస్తూ ఉంది.

టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకతో సహా పలువురు యంగ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ, ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ప్రయత్నించారు. చివరకు పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. అన్నయ్య చైతుతో ‘సవ్యసాచి’ తర్వాత నిధి అగర్వాల్.. అఖిల్‌తో ‘Mr.మజ్ను’ చేసింది. పూజా.. ‘ఒక లైలా కోసం’ తర్వాత అఖిల్‌తో నటించనుంది.

Read Also : సాహో : బేబి వోంట్ యూ టెల్ మి – వీడియో సాంగ్..

హీరోగా అఖిల్ నాలుగవ సినిమా ఇది.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ తరహాలోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు.