Rent Fat People : అద్దెకు ఊబకాయులు..గంటకు ఫీజు ఎంతంటే..

రండి బాబూ రండి అద్దెకు ఊబకాయులు అంటూ ఓ సంస్థ బోర్డు పెట్టేసింది. ఊబకాయులు అద్దెకు కావాలంటే గంటకు రేటు కూడా ఫిక్స్ చేసింది. ఇంతకీ వాళ్లను ఎందుకు అద్దెకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు?అసలు ఈ ఊబకాయులతో బిజినెస్ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందీ అంటే..

Rent Fat People : అద్దెకు ఊబకాయులు..గంటకు ఫీజు ఎంతంటే..

Rent Fat People

unique service lets you rent fat people : లావుగా ఉన్నవారికంటే సన్నగా నాజూగ్గా ఉన్నవారు అంటేనే చాలామంది ఇష్టపడతారు. అలాని లావుగా ఉన్నవాళ్లేమీ బాధపడనక్కర్లేదు. వారికి కూడా డిమాండ్ ఉంది అంటున్నారు కొన్ని సంస్థల వాళ్లు. ఎందుకంటే లావుగా దుడ్డులా ఉన్నవారిని అద్దెకు ఇస్తున్నాయి కొన్ని సంస్థలు. మనుషుల్ని ఎవరైనా అద్దెకు తీసుకుంటారా? అందులోని లావుగా ఉన్నవారిని? అని ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజమే.

జపాన్ లో కొన్ని సంస్థలు ఊబకాయుల్ని అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాయి. వీళ్లను అద్దెకు తీసుకోవటానికి గంటకు జపాన్ కరెన్సీలో 2 వేల జపాన్ యెన్‌లు అదే భారత కరెన్సీలో రూ.1,333లు చెల్లించాలి. రండి బాబూ రండి ఊబకాయులను అద్దెకిస్తాం అంటూ ఓ సంస్థ ఏకంగా బోర్డే పెట్టేసింది. అలా వారిని కొన్ని గంటలపాటు అద్దెకు ఉంచుకోవాలనుకుంటూ గంటకు అదే లెక్కన చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇంతకీ ఈ లావుగా ఉండేవారిని ఎందుకు అద్దెకు ఇస్తున్నారు?వీరి వల్ల ఉపయోగం ఏమిటీ? అనే కదా అసలైన అనుమానం..ఎందుకంటే..లవ్ చేసి బ్రేకప్ కు గురైనవారు, ఒంటరితనం ఫీల్ అయ్యేవారు. ఓదార్పు కోరుకుంటారు. కాస్తంత స్నేహం..కాస్తంత ప్రేమాభిమానాలు కోరుకుంటారు. అటువంటివారి కోసం లావుగా ఉండేవారిని అద్దెకిస్తూ ఉంటారు. ఇది డేటింగ్ కాదు..కేవలం తోడు కోసం మాత్రమే. మరి దీని కోసం ఊబకాయులే ఎందుకు అంటే..లావుగా ఉండేవారు ఆత్మనూన్యతతో లోలోపల బాధ పడుతుంటారు. అలా బాధ ఫీల్ అయ్యేవారికి సాటి మనష్యుల బాధలు అర్థం అవుతాయట..అందుకే ఇలా ఊబకాయులను అద్దెకు ఇవ్వటం..

‘డెబుకారి’ అనే ఓ సంస్థ లావుగా ఉండే వ్యక్తులను అద్దెకివ్వడం ప్రారంభించింది. సుమారు వంద కిలోలు కంటే ఎక్కువ బరువుండే ఈ వ్యక్తులు జపాన్‌లో చాలా అరుదుగా కనిపిస్తారట. దీంతో ఈ అరుదైన వ్యక్తులను ఆన్‌లైన్ ప్రజలకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందని..బిజినెస్ గా బాగుంటుందని భావించింది. ‘డెబుకారి’ సంస్థ యజమాని మిస్టర్ బ్లిజ్‌ ఇదివరకు లావుగా ఉండే వ్యక్తుల కోసం ‘క్యూజిల్లా’ అనే బ్రాండ్‌ను స్థాపించాడు. కానీ అతని ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి లావుగా ఉండే వ్యక్తులు దొరికేవారు కాదు. దీంతో ఓ ఐడియా వచ్చింది. తమ వద్దకు బట్టలు కొనుక్కోవటానికి వచ్చే ఊబకాయుల్నే తమ దుస్తులకు మోడల్‌గా సెలక్ట్ చేసుకున్నాడు. వారితో మాట్లాడి 45 మందిని చేర్చుకున్నాడు.

ఈక్రమంలో మిస్టర్ బ్లిజ్ కు మరో కొత్త ఐడియా వచ్చింది. తన దగ్గర పనిచేసే ఊబకాయులను సాధారణ ప్రజలకు అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందని అని ఆలోచించాడు. అసలు ఈ ఆలోచన రావటం చాల విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ బ్లిజ్ ఆలోచన వేరు. మరి ఊబకాయుల్ని ఎవరు అద్దెకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు?అసలు ఆ అవసరం ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలక బ్లిజ్ దగ్గర మాంచి ఆన్సర్ కూడా ఉంది. దాంట్లో ఒకటి.. తన బ్రాండ్ దుస్తులు ప్రయత్నించేందుకు వచ్చే వ్యక్తులు తమ మోడల్‌ను అద్దెకు తీసుకోవడం ద్వారా దుస్తులను సెలెక్ట్ చేసుకోవచ్చని..వారు ఆడవారైనా..మగవారైనా తమ షాపులో దుస్తులు వేసి ఎలా ఉంటామో చూసుకోవచ్చని పేర్కొన్నాడు. అంతేగాక.. లావుగా ఉన్నామని బాధపడే వ్యక్తులు.. తమ కంటే లావుగా ఉండేవారిని చూస్తే సంతోషిస్తారని..కాబట్టి.. తమ ‘ప్లస్’ మోడల్స్‌ను అద్దెకు తీసుకోవడం ద్వారా వారు కాసేపైనా సంతోషంగా ఉండవచ్చని బ్లిజ్ వివరించాడు.

ఇదేకాదు..జపాన్ లో కొన్ని సంస్థలు ‘డైట్ ప్లానింగ్’ ప్రకటనల కోసం లావుగా ఉండేవారి కోసం వెతుకుతున్నాయి.కానీ జపాన్ లో ప్లస్ సైజు ఉన్నవారు జపాన్‌లో తక్కువమంది ఉంటారట. కాబట్టి.. తమ ‘ప్లస్ సైజ్’ సిబ్బందిని అద్దెకు తీసుకోవడం ద్వారా తమ పని ఈజీ అవుతుందని చెప్పుకొచ్చాడు బ్లిజ్. వాళ్లను ‘ఫ్యాట్’ అని పిలవం. షాపుకు వచ్చినవారు ఎవరైనా అలా పిలిచినా వాళ్లు ఏం ఫీల్ కారు. ఎందుకంటే.. వారి ఊబకాయమే వారికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి. అంతేకాదు ఊబకాయలు మేం అరుదైనవాళ్ల..అందుకే కొన్ని సంస్థలు మాకోసం వెతుకుతున్నాయి అని అనుకుంటారట. కాగా..ఈ ఊబకాయుల నిబంధనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో చేరేందుకు 18 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అద్దెకు వచ్చిన డబ్బులు మొత్తం వారికే చెల్లిస్తాం. మేం ఒక్క రూపాయి కూడా తీసుకోం. కేవలం కార్పొరేట్ కస్టమర్లు చెల్లించే అద్దెను మాత్రమే సంస్థ తీసుకంటుందని అని బ్లిజ్ తెలిపాడు.