దీపావళికి విజయ్‌తో ఢీ కొట్టబోతున్న కార్తీ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న తమిళ సినిమా 'కైథీ' దీపావళికి విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : August 27, 2019 / 12:20 PM IST
దీపావళికి విజయ్‌తో ఢీ కొట్టబోతున్న కార్తీ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న తమిళ సినిమా ‘కైథీ’ దీపావళికి విడుదల కానుంది..

యుగానికి ఒక్కడు, ఆవారా, నాపేరు శివ, కాష్మోరా, చినబాబు వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో పాటు తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు కార్తీ. ప్రస్తుతం తమిళ్‌లో ‘కైథీ’  మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్‌ అండ్ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘మా నగరం’ సినిమాతో ప్రేక్షకలను అలరించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దోపిడీలు, హత్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. కార్తీ రఫ్ అండ్ టఫ్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనుండగా.. నరేన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీపావళికి తమిళనాట ‘కైథీ’ గ్రాండ్‌గా విడుదల కానుంది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ కూడా దీపావళికే రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ బరిలో విజయ్ లాంటి స్టార్ హీరోని కార్తీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి.

Read Also : మళ్లీ వాయిదా పడ్డ వాల్మీకి..

సిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, మ్యూజిక్ : శ్యామ్ సిఎస్, ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ : ఎన్. సతీష్ కుమార్, స్టంట్స్ : అన్బరివు, డైలాగ్స్ : పోన్ పార్థిబన్, లోకేష్ కనగరాజ్, నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుప్పుర్ వివేక్.