ఓనర్ గెంటేస్తాడనే భయంతో : బతికుండగానే తల్లిని శ్మశానానికి తీసుకెళ్లిన కొడుకు

తల్లి అద్దె ఇంట్లో చనిపోతే యజమాని తమను బయటికి పంపిస్తాడేమోననే భయంతో ఓ కుమారుడు.. బతికుండగానే తన తల్లిని శ్మశానానికి తీసుకెళ్లాడు.

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 04:09 PM IST
ఓనర్ గెంటేస్తాడనే భయంతో : బతికుండగానే తల్లిని శ్మశానానికి తీసుకెళ్లిన కొడుకు

Updated On : May 28, 2020 / 3:44 PM IST

తల్లి అద్దె ఇంట్లో చనిపోతే యజమాని తమను బయటికి పంపిస్తాడేమోననే భయంతో ఓ కుమారుడు.. బతికుండగానే తన తల్లిని శ్మశానానికి తీసుకెళ్లాడు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి అద్దె ఇంట్లో చనిపోతే యజమాని తమను బయటికి పంపిస్తాడేమోననే భయంతో ఓ కుమారుడు.. బతికుండగానే తన తల్లిని శ్మశానానికి తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం (ఆగస్టు 27, 2019)వ తేదీన జరిగింది. జగిత్యాలకు చెందిన ధర్మయ్య భార్యాపిల్లలతోపాటు తల్లి నర్సమ్మ (95)తో కలిసి దేవీశ్రీ గార్డెన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 

ధర్మయ్య తండ్రి మల్లయ్య 30 ఏళ్ల క్రితం మరణించాడు. రెండు నెలల క్రితం తల్లి నర్సమ్మ ఇంట్లో జారిపడగా కాలు ఎముక విరిగింది. చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం నయం కాలేదు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుండటం.. అందులోనూ అద్దె ఇల్లు కావడంతో ధర్మయ్య తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 

తల్లి ఇంట్లో చనిపోతే యజమాని గొడవకు దిగుతాడేమోననే, ఇంటి నుంచి బయటికి పంపిస్తాడేమోననే భయంతో ధర్మయ్య తన తల్లిని సాయంత్రం మోతె రోడ్డులోని శ్మశానానికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ ఆస్పతి సూపరింటెండెంట్ వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : అయ్యో ఘోరం జరిగిపోయింది : ఎయిడ్స్ అని తప్పుడు రిపోర్ట్.. షాక్ తో మహిళ మృతి