Upcoming Movies : ఈ సినిమాలన్నీ పూర్తయ్యేదెప్పుడు..?
స్టార్ హీరోల కోసం డైరెక్టర్లు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు.. హీరోలు కూడా ఇక డిలే ఎందుకుని డైరెక్టర్లతో కమిట్ అయిపోతున్నారు..
Upcoming Movies: స్టార్ హీరోల కోసం డైరెక్టర్లు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు. హీరోలు కూడా ఇక డిలే ఎందుకుని డైరెక్టర్లతో కమిట్ అయిపోతున్నారు. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్‌తో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కానీ, అసలు ఇవన్నీ వర్కౌట్ అయ్యేదెప్పుడు..?
క్రేజీ డైరెక్టర్లతో స్టార్ హీరోలు వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్‌గా ఎంగేజ్ అవుతున్నారు. రాబోయే 2,3 ఏళ్లకు డైరీని ఫిల్ చేసేసుకుంటున్నారు. క్రేజీ కాంబినేషన్స్ కమిట్ అవుతున్నారు. కానీ, అవి వర్కౌట్ అవుతాయా లేదా అన్నది మాత్రం డౌట్ ఫుల్‌గానే ఉంటోంది. రామ్ చరణ్, శంకర్‌తో సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకెళ్లేలా లేదు. ట్రిపుల్ షూటింగ్ పెండింగ్‌తో పాటు, శంకర్‌కి ఇంకా భారతీయుడి కమిట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి.. చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ సినిమాయే చేస్తాడు అన్న గ్యారంటీ మాత్రం మిస్ అవుతోంది.
టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సూపర్‌స్టార్ మహేష్ బాబు -స్టార్ డైరెక్టర్ రాజమౌళిది. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి సినిమాపై మహేష్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఆల్రెడీ పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న మహేష్ బాబు.. నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్‌తో కమిట్ అయ్యి రాజమౌళి సినిమాపై సస్పెన్స్‌ని అలాగే ఉంచేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందో చూడాలి.
ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ అంతలోనే ఎన్టీఆర్, కొరటాల, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు కమిట్ అవ్వడంతో.. ముందుగా అనుకున్న త్రివిక్రమ్ సినిమా సైడైపోయింది. మరి త్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అని ఆలోచిస్తున్నారు ఆడియెన్స్.
ప్రభాస్ -నాగ్ అశ్విన్.. టాలీవుడ్లోనే క్రేజీ కాంబినేషన్. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ అనౌన్స్ చేసిన సినిమా అయినా.. ఇప్పటి వరకూ సినిమా సెట్స్ మీదకే వెళ్లలేదు. ఈ మధ్యలోనే ప్రభాస్.. ఓమ్ రౌత్‌తో ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ సినిమాలు ప్యార్లర్‌గా స్టార్ట్ చేసేశారు. దాంతో నాగ్ అశ్విన్ సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు వర్కౌట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.
ఈ మద్య ప్రయోగాలు చేస్తున్న అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ నీల్‌తో సినిమా కమిట్ అయ్యారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ‘సలార్’, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ కూడా వేణు శ్రీరామ్, త్రివిక్రమ్, సుకుమార్ ఇలా వరుసగా సినిమాలు చెయ్యాల్సి ఉంది. మరి లిస్ట్‌లో ఉన్న ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కేదెప్పుడా అని అందరి డౌట్.
నాట్ బట్ నాట్ లీస్ట్.. విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన మూవీ కూడా ఈ లిస్ట్‌లోకే వస్తుంది. రౌడీ హీరో ‘లైగర్’ సినిమాని కంప్లీట్ చెయ్యలేదు, శివ నిర్వాణతో కమిట్మెంట్ కూడా ఉంది. ఇక సుకుమార్‌కి కూడా ‘పుష్ప’ 2 పార్ట్స్ కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. మరి ఇంత టైట్ షెడ్యూల్లో సుకుమార్ -విజయ్ సినిమా ఎలా వర్కౌట్ అవుతుందో..?