Gold Rate : బంగారం ధర రూ. లక్ష మార్కును తాకనుందా..! తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
Gold And Silver Price : రాబోయే కొద్ది నెలల్లో తులం బంగారం ధర రూ. లక్ష మార్కును తాకబోతుందా? ప్రస్తుతం రికార్డు స్థాయిలో గోల్డ్ ధరలు నమోదువుతున్నాయి.. ఆకాశమే హద్దుగా బంగారం ధర దూసుకెళ్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండుమూడు నెలల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. లక్ష మార్కుకు చేరుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే విషయాన్ని ట్రేడింగ్ వర్గాలుసైతం పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే.. ఏప్రిల్ నెలలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ రేట్లు.. మే నెల ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. శుక్రవారం భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. శనివారం పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,830 వద్దకు చేరింది. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,000 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,980.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,830.
చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 150 తగ్గగా.. 24 క్యారట్ల బంగారంపై రూ. 160 తగ్గింది. దీంతో అక్కడ.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,000.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.86,500 వద్ద కొనసాగుతుంది
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 86,500.
కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,000
బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 82,600.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.