Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి

రోడ్డుపక్కనున్న లోయలోకి కారు దూసుకెళ్లడంతో.. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా.. ఒక విద్యార్థినీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి

Dehradun-Mussoorie Accident

Updated On : May 4, 2024 / 12:29 PM IST

Uttarakhand Accident : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విహారయాత్రకోసం మస్సోరీ వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డెహ్రాడూన్ మార్గంలో శనివారం ఉదయం 5గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పానీవాలా బండ్ వద్ద రోడ్డుపక్కనున్న లోయలోకి కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా.. ఒక విద్యార్థినీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన మరో యువతికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీలో చదువుతున్న వారిగా పోలీసులు గుర్తించారు.

Also Read : ఏపీ ఎన్నికల్లో లేడీస్ స్పెషల్.. ఆ 5 నియోజకవర్గాల్లో మహిళల మధ్య రసవత్తర పోరు

కాలేజీలోని నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ముస్సోరికీ విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ముస్సోరీ పోలీస్ ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను కారు నుంచి వెలికి తీశారు. గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతులు అమన్ సింగ్ రాణా, డింగ్యాష్ ప్రతాప్ భాటి, తనూజా రావత్, అశుతోష్ తివారీ, హృదయాంశ్ చంద్ర. గాయపడిన బాలిక నయన్‌శ్రీ గా పోలీసులు గుర్తించారు.

Also Read : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్: బోయినపల్లి వినోద్ కుమార్