Vithika Sheru : ఇంకా పిల్లలు ఎందుకు లేరో చెప్పిన వితిక.. ఆ సంఘటనతో..
వితికా 2016లో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయి ఎనిమిదేళ్లు అయిన ఇంకా పిల్లలు లేరు అని ఎవరో ఒకరు వితికాని అడుగుతూనే ఉంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది.

Varun Sandesh Wife Actress Vithika Sheru shares her Bad Experience with Pregnancy
Vithika Sheru : సినీ పరిశ్రమకి నటిగా పరిచయమైనా వితికా షేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కెరీర్ లో ఎదుగుతున్నప్పుడే నటుడు వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. బిగ్ బాస్ లో పాల్గొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది వితికా షేరు. ప్రస్తుతం వితికా సోషల్ మీడియా, యూట్యూబ్, పలు టీవీ షోలతో అలరిస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది.
వితికా 2016లో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయి ఎనిమిదేళ్లు అయిన ఇంకా పిల్లలు లేరు అని ఎవరో ఒకరు వితికాని అడుగుతూనే ఉంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది.
Also Read : B S Sarwagna Kumar : కల్కి సినిమాకి ఈ డైరెక్టర్ పనిచేశాడని తెలుసా? ఎవరంటే?
వితికా షేరు మాట్లాడుతూ.. అందరూ పిల్లల గురించి అడుగుతారు. నాకు కూడా పిల్లలు చాలా ఇష్టం. 2018లో నేను ఫస్ట్ టైం ప్రగ్నెంట్ అయ్యాను. అప్పుడు మేము అమెరికాలో ఉన్నాము. నేను ప్రగ్నెంట్ అవ్వడంతో సందేశ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరికి చెప్పేసాడు. కానీ కొన్ని రోజులకే గర్భస్రావం జరిగింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చాము. నాకు పీరియడ్స్ రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ కి వెళ్తే ప్రగ్నెంట్ అని చెప్పారు. నేను ఆల్రెడీ మిస్ క్యారేజ్ జరిగింది అని చెప్పాను. మళ్ళీ టెస్టులు చేసి, సర్జరీ చేసి కడుపులో ఉన్న ఆ బేబీ పార్టికల్స్ అన్ని తీసేసారు. దాన్నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టింది. మేము ఫైనాన్సియల్ గా కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ప్రగ్నెంట్ అయితే నేనే అందరికి చెప్తాను అని తెలిపింది.