B S Sarwagna Kumar : కల్కి సినిమాకి ఈ డైరెక్టర్ పనిచేశాడని తెలుసా? ఎవరంటే?

తాజాగా ఓ డైరెక్టర్ కల్కి సినిమాకు పనిచేసినట్లు తెలిపారు.

B S Sarwagna Kumar : కల్కి సినిమాకి ఈ డైరెక్టర్ పనిచేశాడని తెలుసా? ఎవరంటే?

My Dear Donga MOvie Director said he Worked for Prabhas Kalki 2898AD Movie

Updated On : May 4, 2024 / 9:47 AM IST

B S Sarwagna Kumar : ప్రభాస్(Prabhas) కల్కి(Kalki) సినిమా గురించి దేశమంతా ఎదురుచూస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ కాస్ట్, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కలియుగాంతంలో జరిగే కథతో చాలా ఆసక్తిగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెరెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, అమితాబ్ క్యారెక్టర్, పోస్టర్స్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి నాగ్ అశ్విన్ వద్ద చాలా మంది పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చాలా మంది పనిచేస్తారు. తాజాగా ఓ డైరెక్టర్ కల్కి సినిమాకు పనిచేసినట్లు తెలిపారు. ఇటీవల అభినవ్ గోమఠం, షాలిని కొండేపూడి మెయిన్ లీడ్స్ లో ఆహా ఓటీటీలో మై డియర్ దొంగ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. మై డియర్ దొంగ ఆహా ఓటీటీలో మంచి విజయం అందుకుంది.

Also Read : SSMB 29 : సైలెంట్‌గా రాజమౌళి మహేష్ సినిమా వర్క్స్ షాప్స్.. హాజరవుతున్న మహేష్..

ఇటీవల జరిగిన మై డియర్ దొంగ సక్సెస్ మీట్ లో ఈ సినిమా డైరెక్టర్ బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మాట్లాడుతూ.. తాను నాగ్ అశ్విన్ వద్ద కల్కి సినిమాకి అడిషినల్ రైటర్ గా పనిచేశానని తెలిపాడు. ఎవరూ ఊహించని సరికొత్త కాన్సెప్ట్ తో కల్కి సినిమా ఉంటుందని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. పలు సినిమాలకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసిన బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ కల్కి సినిమాకు అడిషినల్ రైటర్ గా పనిచేసారు. ఇటీవల మై డియర్ దొంగ సినిమాతో దర్శకుడిగా మారారు. మరి భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్స్ తో వస్తారో చూడాలి.