SSMB 29 : సైలెంట్‌గా రాజమౌళి మహేష్ సినిమా వర్క్స్ షాప్స్.. హాజరవుతున్న మహేష్..

తాజాగా రాజమౌళి మహేష్ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది.

SSMB 29 : సైలెంట్‌గా రాజమౌళి మహేష్ సినిమా వర్క్స్ షాప్స్.. హాజరవుతున్న మహేష్..

Rajamouli Mahesh Babu SSMB 29 Movie Update Rumours Go Viral

Updated On : May 4, 2024 / 9:09 AM IST

SSMB 29 : రాజమౌళి(Rajamouli) మహేష్ బాబు(Mahesh Babu) సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా పనులు సైలెంట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాకి కావాల్సిన లుక్ రెడీ చేసుకుంటున్నాడు. ఇటీవల మహేష్ కొంచెం హెయిర్, బాడీ పెంచి కనపడిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన KL నారాయణ.. రాజమౌళి, మహేష్ సినిమా షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుగుతుందని తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వినిపిస్తుంది. రాజమౌళి ఆల్రెడీ SSMB 29 సినిమా వర్క్ మొదలుపెట్టారని, సైలెంట్ గా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నాడని టాలీవుడ్ సమాచారం.

Also Read : Rajamouli : రాజమౌళి రాసిచ్చిన లెటర్‌ని.. ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లెటర్‌లో ఏం రాసారంటే..

ఆల్రెడీ గతంలో విజయేంద్రప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. రాజమౌళి తన సినిమా షూట్ కి అన్ని ప్రిపేర్ చేసుకొని, స్క్రిప్ట్ అంతా వర్క్ షాప్ చేసుకొని మరీ పకడ్బందీగా వెళ్తారు. సెప్టెంబర్ లో షూటింగ్ అన్నారు కాబట్టి ఇప్పుడు వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారట. మహేష్ ని రాజమౌళి తనకు తగ్గట్టు మార్చుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయో తెలిసిందే.