Rajamouli : రాజమౌళి రాసిచ్చిన లెటర్‌ని.. ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లెటర్‌లో ఏం రాసారంటే..
గతంలో రాజమౌళి ఓ డైరెక్టర్ ని మెచ్చుకోవడమే కాదు సినిమా రిలీజ్ కి ముందు ప్రేమగా ఒక లెటర్ కూడా రాసిచ్చాడు అంట.

Rajamouli Write A letter to Director Chnadoo Mondeti Before his First Movie Release
Rajamouli – Chandoo Mondeti : రాజమౌళి ఒక సినిమాని కాని, దర్శకుడిని కాని మెచ్చుకున్నాడు అంటే అందులో విషయం ఉన్నట్టే. అయితే గతంలో రాజమౌళి ఓ డైరెక్టర్ ని మెచ్చుకోవడమే కాదు సినిమా రిలీజ్ కి ముందు ప్రేమగా ఒక లెటర్ కూడా రాసిచ్చాడు అంట. ఆ డైరెక్టర్ చందూ మొండేటి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
చందూ మొండేటి మాట్లాడుతూ.. కార్తికేయ సినిమా అప్పుడు నిఖిల్ తప్ప అందరం కొత్తవాళ్లే. సినిమా మీద అంత బజ్ కూడా లేదు. కాని టీజర్ రిలీజ్ అయ్యాక రాజమౌళి గారికి నచ్చి బాగుందని తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెప్తే చూశాను. సినిమా హిట్ అయిన దానికంటే ఎక్కువ హ్యాపినెస్ అనిపించింది. రాజమౌళి గారు మా సినిమా గురించి ట్వీట్ వేయడంతో ఒక్కసారిగా మా సినిమాపై బజ్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ ముందు కార్తికేయ హిట్ అవుతుందని, నా వర్క్ ని ప్రశంసిస్తూ, టీజర్, ట్రైలర్స్ ని అభినందిస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ ని ఫ్రేమ్ కట్టుకొని మరీ పెట్టుకున్నాను. సినిమా రిలీజ్ ముందే రాజమౌళి గారిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకి అంటే అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించింది అని తెలిపారు.
Also Read : Baak Movie Review : ‘బాక్'(అరణ్‌మనై 4) మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్‌లో భయపెట్టారుగా..
రాజమౌళి గతంలోనే కాదు ఇప్పటికి తనకి ఏదైనా టీజర్, ట్రైలర్, సినిమా నచ్చితే, ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతారు, వాటి గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు.