సాహో : 1 మిలియన్ దాటేసింది

అమెరికాలో సాహో ప్రీమియర్స్ రూపంలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది..

  • Published By: sekhar ,Published On : August 31, 2019 / 05:17 AM IST
సాహో : 1 మిలియన్ దాటేసింది

అమెరికాలో సాహో ప్రీమియర్స్ రూపంలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. ఆగస్టు 29 రాత్రి నుండి యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. విపరీతమైన నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. యూఎస్‌లో ప్రీమియర్ వసూళ్లు చూసి, సినిమాను భారీ ధరకు కొన్న అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు.

సాహో ప్రీమియర్స్ రూపంలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్స్‌లో 9,15,224 డాలర్లు వసూలు చేసింది.  ఈ లెక్కన అమెరికాలో ప్రీమియర్‌ వసూళ్ల పరంగా ‘సాహో’ ఆరో స్థానంలో ఉంది. ప్రీమియర్స్‌లో ‘బాహుబలి 2’ : 2.4 మిలియన్‌ డాలర్లు, ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్‌ డాలర్లు, ‘బాహుబలి’.. ది బిగినింగ్ : 1.39 మిలియన్‌ డాలర్లు, ‘ఖైదీ నంబర్‌ 150’ 1.29 మిలియన్‌ డాలర్లు, ‘స్పైడర్‌’ 1.00 మిలియన్‌ డాలర్లు రాబట్టగా..

Read Also : రష్మీ రాకెట్ – మోషన్ పోస్టర్..

‘సాహో’ 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత ‘భరత్‌ అనే నేను’ 850 వేల డాలర్లు, ‘అరవింద సమేత’ 789 వేల డాలర్లు, ‘రంగస్థలం’ 725 వేల డాలర్లు, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ 616 వేల డాలర్లు రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ముందు ముందు వసూళ్లు పుంజుకుంటాయో లేదో చూడాలి మరి.