బామ్మ కాదు అమ్మ : కవలలకు జన్మనివ్వనున్న 73 ఏళ్ల వృద్ధురాలు

తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు గర్భం దాల్చింది.

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 02:09 AM IST
బామ్మ కాదు అమ్మ : కవలలకు జన్మనివ్వనున్న 73 ఏళ్ల వృద్ధురాలు

తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు గర్భం దాల్చింది.

దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ మహిళ కల నెరవేరనుంది. మనువళ్ల పిల్లలను ఎత్తుకోవాల్సిన వయస్సులో ఆమె తల్లి కాబోతుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ వయస్సు మహిళ జన్మనిస్తుందనే విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..  73 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు గర్భం దాల్చింది.

గురువారం (సెప్టెంబర్ 5, 2019) ఆమెకు డాక్టర్లు సిజేరియన్ చేసి డెలీవరి చేయనున్నారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ వైద్య నిపుణుడు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ బుధవారం (సెప్టెంబర్ 4, 2019) విలేకరులకు వివరాలు వెల్లడించారు. 

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

2018 నవంబర్ లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా ఐవీఎఫ్ పద్ధతిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆమెకు బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది.

గుండె వైద్య నిపుణులు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు శనక్కాయల ఉదయ్ శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్ చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. 73 ఏళ్ల వృద్ధురాలు గర్భం దాల్చడం దేశంలో ఇదే మొదటిసారని వివరించారు.

Also Read : ఇక నుంచి ఆ నాలుగు ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు