Biggboss 5 Season : బిగ్‌బాస్ 5 సీజన్‌కు భారీ సెట్.. అతి త్వరలో ప్రోమో..!
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. సెకండ్ వేవ్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షో కాస్తా ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ భారీ సెట్ వర్క్ కూడా మొదలైనట్టు టాక్ నడుస్తోంది.
Telugu Biggboss 5 Season : తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. సెకండ్ వేవ్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షో కాస్తా ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ భారీ సెట్ వర్క్ కూడా మొదలైనట్టు టాక్ నడుస్తోంది. సీజన్ ఫస్ట్ టీజర్ వచ్చే నెలలో రిలీజ్ కానుందట.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికీ నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో.. ఐదో సీజన్‌తో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.
బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా చేస్తే.. రెండో సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్టుగా నడిపించారు. చివరి రెండు సీజన్లలో వరుసగా అక్కినేని నాగార్జున హోస్టుగా తనదైన శైలిలో సక్సెస్ ఫుల్‌గా నడిపించారు. ఈసారి ఐదో సీజన్ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్లు, హోస్టు వంటి అంశాలపై హవా మొదలైంది. హోస్ట్ నాగార్జున తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది.
నాగ్ స్థానంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి హోస్టుగా రానున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. స్టార్ కమెడీయన్ అలీ కూడా పార్టిసిపేట్ చేస్తారని టాక్.. ఐదో సీజన్‌కు బిగ్ బాస్ సెట్ పనులు మొదలయ్యాయని, త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత నిజమెంతో కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.