Team India : టీమ్ఇండియా క్రికెట‌ర్ల‌లో స్పూర్తిని నింపుతున్న ‘క‌ల్కి 2898AD’ అశ్వ‌త్థామ.. ‘ఇది మహాయుద్ధం.. శ‌త్రువు క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి..’

మ‌రో నెల రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుంది.

Team India : టీమ్ఇండియా క్రికెట‌ర్ల‌లో స్పూర్తిని నింపుతున్న ‘క‌ల్కి 2898AD’ అశ్వ‌త్థామ.. ‘ఇది మహాయుద్ధం.. శ‌త్రువు క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి..’

screengrab from video posted on insta by@starsportsindiaandkalki2898ad

Updated On : May 2, 2024 / 3:10 PM IST

Team India-T20 World Cup 2024 : మ‌రో నెల రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్‌, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుకు బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌త్యేక సందేశం ఇచ్చారు. భార‌త క్రికెట‌ర్ల‌లో స్పూర్తిని నింపారు. టీ 20 ప్రపంకప్‌ 2024 కోసం శంఖానాదం మోగింది అంటూ త‌న కొత్త సినిమా ‘క‌ల్కి 2898AD’. లోని అశ్వ‌త్థామ అవ‌తారంలో అమితాబ్ వీడియో ద్వారా చెప్పారు.

‘ఇది మ‌హా యుద్ధం.. గొప్ప పోరాటం.. ధైర్యంగా ఉండండి.. విజ‌యం ముందు అస్స‌లు త‌ల‌వంచొద్దు.. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి.. బ‌లాన్ని చూపండి.. ప్ర‌తి ఒక్క‌రూ గ‌ర్వ‌ప‌డేలా చేయండి. శ‌త్రువు క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూడండి.. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధ‌మ‌వుతారు.’ అంటూ అమితాబ్ క్రికెట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.

Rohit Sharma : ఏంటిది రోహిత్ భ‌య్యా.. నీకు మిశ్రానే దొరికాడా? కాస్త చెప్పేది వినొచ్చుగా..?

ఈ వీడియోను చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. కాగా.. వీడియోలో అమితాబ్ వాయిస్ వినిపిస్తుండ‌గా టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య త‌దిత‌ర క్రికెట‌ర్ల‌ను తెర‌పైన చూపించారు. అంతేనా దేశానికి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనిని, ఆనాటి సంబ‌రాల‌ను చూపించారు.

ఇక సినిమా ‘క‌ల్కి 2898AD’ విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ స్టార్స్‌ దీపికా ప‌దుకోన్‌, దిశాప‌టాని ల‌తో పాటు టాలీవుడ్ స్టార్ న‌టుడు రానాలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత అశ్విని ద‌త్ దాదాపు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినీ ప్రియులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న ఈ సినిమా 2024 జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Hardik Pandya : అయ్యో పాపం.. హార్దిక్ పాండ్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. మ‌రోసారి ఇలా చేస్తే మ్యాచ్ నిషేదం..

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)