Allu Arjun : హలో వార్నర్.. అదేం పెద్ద కష్టమైన స్టెప్ కాదు.. కలిసినప్పుడు నేర్పిస్తా : అల్లు అర్జున్
దీన్ని చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ డియర్ ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది. అంటూ కామెంట్ చేశాడు.

David Warner wants to learn Pushpa 2 hook step Easy says actor Allu Arjun
Allu Arjun – David Warner : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్, సుకుమార్‌లు పాన్ ఇండియాలో పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో పుష్ప 2 కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ సాగే పుల్ టైటిల్ లిరికల్ పాటను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటలోని కొంత ట్రాక్‌వీడియోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ ల్‌లో పంచుకున్నాడు. ” పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను” అని దానికి క్యాప్షన్ ఇచ్చాడు. #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఈ పోస్ట్‌కి జోడించాడు. దీన్ని చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘ఓ డియర్ ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది.’ అంటూ కామెంట్ చేశాడు.
View this post on Instagram
డేవిడ్ వార్నర్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. “ఇది చాలా సులభం. మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను” అని నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన చాట్ వైరల్‌గా మారింది.

Screenshot of Allu Arjun’s comment
ఐపీఎల్ ద్వారా డేవిడ్ వార్నర్ కు తెలుగు చిత్రాలపై మమకారం ఏర్పడింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలంటే చెప్పాల్సిన పని లేదు. లాక్‌డౌన్‌లో అలా వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు, డైలాగ్‌లకు రీల్స్ చేశాడు. ఆ తరువాత పుష్ప సినిమాలో పలు డైలాగ్‌లతో పాటు శ్రీవల్లి పాటకు వార్నర్ డ్యాన్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2లోని షూ డ్రాప్ స్టెప్ చేయాలని వార్నర్ ఫిక్సైయ్యాడు. అందుకనే తన కామెంట్‌లో కొంత పని పడిందని చెప్పగా.. అదేమీ పెద్ద కష్టమైన స్టెప్ కాదని కలిసి నప్పుడు నేర్పిస్తానని అంటూ అల్లు అర్జున్ అన్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు.