Pushpa Song : యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తున్న పుష్ప సాంగ్.. ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్..

తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Pushpa Song : యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తున్న పుష్ప సాంగ్.. ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్..

Allu Arjun Sukumar Pushpa 2 Title Song Creates New Records in You Tube

Updated On : May 2, 2024 / 6:00 PM IST

Pushpa Song : అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దేశాన్ని ఊపేయడంతో రాబోయే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుంది. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రాగా నిన్న ఫస్ట్ సాంగ్ పుష్ప టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప.. అంటూ సాగే ఈ పాట, అందులో అల్లు అర్జున్ అదిరే స్టెప్పులు.. అందరికి తెగ నచ్చేసాయి.

Also Read : Jithender Reddy Trailer : ఎన్నికల ముందు సంచలన బయోపిక్.. ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా..

దీంతో పుష్ప సాంగ్ వైరల్ అవ్వగా యూట్యూబ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. పుష్ప సినిమాకి విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పుష్ప సాంగ్ విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతుంది. తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట 24 గంటల్లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతే కాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది.

పుష్ప మొదటి సాంగ్ తోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండటంతో బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది.