సిలిండర్ అలర్ట్ : ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 04:18 AM IST
సిలిండర్ అలర్ట్ : ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్

హైదరాబాద్ : సిలిండర్..వాడుతున్నారా..అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవలే సిలిండర్లు పేలుతుండడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు గృ‌హిణులను వణికిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ వెలిగించాలంటే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి గ్యాస్ సిలిండర్ వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. 
జాగ్రత్తలతో మేలు…

  • వంట చేసేందుకు తయారయ్యే ముందు గ్యాస్ స్టవ్ పరిస్థితిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి.
  • లీక్ అవుతుంటే వెంటనే అప్రమత్తమవ్వండి. గ్యాస్ కంపెనీ అత్యవసర ఫోన్ నెంబర్ (టోల్ ఫ్రీ 1906) సమాచారం అందచేయండి. 
  • గ్యాస్ లీకయిన సందర్భంలో సేఫ్టీపిన్ బిగించి ఖాళీ ప్రదేశంలో సిలిండర్ ఉంచేయండి. 
  • వంట గది తలుపు కింద కనీసం అర అంగుళం ఖాళీ ఉండేలా చూడండి.
  • గ్యాస్ స్టవ్..పూజగది..రిఫ్రిజిరేటర్..ఒకే చోట ఉండకుండా చూడండి.
  • స్టవ్ ఉపయోగించలేని సమయంలో రెగ్యులేటర్‌ని బంద్ చేయండి.
  • వంట చేసే సమయంలో గిన్నె నుండి మంట వేస్తే వెంటనే దానిపై మూత పెట్టేసి బర్నర్ బంద్ చేయండి. 
  • వంట చేసే గదిలో గాలి..వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. 
  • గ్యాస్ సిలిండర్ దగ్గర మంట త్వరగా అంటుకొనే స్వభావం కలిగిన వస్తువులు ఉంచకూడదు. 
  • గ్యాస్ స్టవ్ ట్యూబ్స్ తరచూ మారుస్తుండాలి. ట్యూబ్స్..రెగ్యులరేటర్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.