T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు నో ఛాన్స్
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.

BCCI announce 15 member squad for T20 World Cup 2024
భారత కాలమానం ప్రకారం జూన్ 2న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. దాదాపు అందరూ ఊహించిన విధంగానే జట్టును ఎంపిక చేశారు.
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఎంపిక అయ్యాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ లు నేరుగా ప్రపంచకప్ ఆడనున్నారు.
Global gold demand: అంతర్జాతీయంగా బంగారానికి పెరిగిన డిమాండ్
ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మెరుపులు మెరిపిస్తున్న శివమ్ దూబెలకు ఛాన్స్ ఇచ్చారు. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు ఎంపిక అవ్వగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇచ్చారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా శుభ్ మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ లను ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
రిజర్వ్ ప్లేయర్లు.. శుభ్ మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ లను ఎంపిక చేశారు.
LSG vs MI : కీలక మ్యాచ్‌కు ముందు లక్నోకు గుడ్‌న్యూస్.. హార్దిక్ సేన కష్టాలు రెట్టింపు?
?India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced ?
Let’s get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024