Barabanki accident: ఆవును తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి

బారాబంకిలోని దేవ పోలీస్ స్టేషన్ పరిధిలో కిసాన్ పాత్‌లోని బాబర్హియా గ్రామం సమీపంలో గురువారం(7 అక్టోబర్ 2021) ఉదయం పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Barabanki accident: ఆవును తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి

Bus

Barabanki accident: బారాబంకిలోని దేవ పోలీస్ స్టేషన్ పరిధిలో కిసాన్ పాత్‌లోని బాబర్హియా గ్రామం సమీపంలో గురువారం(7 అక్టోబర్ 2021) ఉదయం పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటివరకు 12 మంది మరణించినట్లు తెలుస్తుంది.

అయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసు సూపరింటెండెంట్ యమునా ప్రసాద్ పోలీసు బలగాలతో పాటు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. మొత్తం 32 మంది తీవ్రంగా గాయపడినట్లుగా చెబుతున్నారు. బస్సు దాదాపుగా నుజ్జునుజ్జ అయ్యింది. పోలీసులు, స్థానిక ప్రజలు సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. ఆవును తప్పించబోయి బస్సు ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.

లారీ మరియు బస్సు ఢీకొనగా.. ఈ ప్రమాదంలో బస్సులోని మెజారిటీ భాగం దెబ్బతింది. బస్సు ఢిల్లీ నుంచి బహ్రాయిచ్‌కు వెళుతోంది. బస్సులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఆదర్శ్ సింగ్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. గాయపడినవారిలో గోండా, బహరైచ్ మరియు బారాబంకి ప్రజలు ఉన్నారు.

సీఎం యోగి విచారం:
బారాబంకి రోడ్డు ప్రమాదంలో ప్రజలు మరణించడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, బాధిత ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.