వామ్మో.. ఒక్కసారిగా ఉప్పొంగిన జలపాతం, ప్రాణ భయంతో పరుగులు తీసిన జనం.. అసలేం జరిగింది?

నీటి ప్రవాహం చూసిన పర్యాటకులు కేకలు వేస్తూ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

వామ్మో.. ఒక్కసారిగా ఉప్పొంగిన జలపాతం, ప్రాణ భయంతో పరుగులు తీసిన జనం.. అసలేం జరిగింది?

Updated On : May 17, 2024 / 9:50 PM IST

Courtallam waterfalls : తమిళనాడు రాష్ట్రం టెన్ కాశీ జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొగింది. పర్యాటకులు స్నానం చేస్తుండగా జలపాతంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం చూసిన పర్యాటకులు కేకలు వేస్తూ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. కాగా, ఈ ప్రవాహంలో కొందరు కొట్టుకుపోయారు.

తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అశ్విన్ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జల పాతంలో వరద ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో కుర్తాళం జలపాతం ఒకటి. టెన్ కాశీ జిల్లాలోని కుర్తాళం జలపాతం చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడే స్నానాలు చేస్తారు. ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఎంజాయ్ చేస్తారు. అయితే, ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా జలపాతం ఉప్పొంగింది. ఎగువ నుంచి జలపాతానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో జలపాతం ఉప్పొగింది. అదే సమయంలో అక్కడే స్నానం చేస్తున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. జలపాతానికి వెళ్లే రహదారి మొత్తం వెంబడి నీళ్లు పొంగి ప్రవహించాయి.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుర్తాళం జలపాతం ఎందుకిలా పొంగింది? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు జలపాతానికి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. జలపాతంలో ఎవరైనా గల్లంతయ్యారేమో అన్న అనుమానంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. జలపాతానికి మరింతగా వరద నీరు వచ్చే అకాశం ఉండటంతో.. జాగ్రత్తగా ఉండాలంటూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా జలపాతం దగ్గరికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు అధికారులు.