ఖాళీ అవుతున్న మూసీ : రేడియల్ గేట్ డ్యామేజ్

  • Published By: madhu ,Published On : October 10, 2019 / 05:22 AM IST
ఖాళీ అవుతున్న మూసీ : రేడియల్ గేట్ డ్యామేజ్

రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 6 వేల 730 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల్లో నాలుగు టీఎంసీల నీరు వృథాగా పోయింది. పాడై పోయిన గేటు స్థానంలో మరో గేటును అమర్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటి మట్టం 622 అడుగులకు పడిపోయింది. గేట్ల మరమ్మత్తులు పూర్తయ్యే సరికి నీటి మట్టం 610 అడుగుల డెడ్ స్టోరేజీకి పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మూసీ డ్యామ్‌కు ఇటీవలే ఓ గేటు కొట్టుకపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటన సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రాజెక్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య పరిశీలించారు. రెండు స్టాప్ లాగ్ గేట్లను అధికారులు చేర్చారు. కొట్టుకపోయిన గేటు స్థానంలో కొత్త దానిని అమర్చేందుకు ఐదు విడి భాగాలున్న గేటు అవసరం ఉంటుంది.

అందులో రెండింటిని చిత్తూరు జిల్లా నుంచి తెప్పించారు. వాటిని బుధవారం సాయంత్రం క్రేన్ల సహాయంతో ఐదో నెంబర్ గేటు స్థానానికి తరలించారు. మరో మూడు గేట్లు హైదరాబాద్‌లోని పటన్ చెరు కర్మాగారంలో నీటిపారుదల శాఖ సీఈ పర్యవేక్షణలో తయారవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పనులు గురువారం వరకు పూర్తి కావచ్చని భావిస్తున్నారు. 
Read More : మోటారు వెహికల్ యాక్టు : మైనర్లకు వాహనం ఇస్తే భారీ జరిమాన!