ఆర్‌డిఎక్స్ లవ్ – రివ్యూ

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రధారులుగా.. భాను శంకర్ దర్శకత్వంలో.. సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఆర్‌డిఎక్స్ లవ్’ - రివ్యూ

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 06:06 AM IST
ఆర్‌డిఎక్స్ లవ్ – రివ్యూ

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రధారులుగా.. భాను శంకర్ దర్శకత్వంలో.. సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఆర్‌డిఎక్స్ లవ్’ – రివ్యూ

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్.. ఆ మూవీలో హాట్‌లుక్స్‌తో అదరగొట్టి, కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్.. ఒక్క సినిమాతోనే చాలా ఆఫర్లు కొట్టేసింది. బోల్డ్ యాటిట్యూడ్‌తో కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో.. ఉన్నది ఉన్నట్టు భయపడకుండా మాట్లాడుతూ… తన ఇమేజ్‌ను ఇంకా పెంచుకుంది. 
పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల లీడ్ రోల్స్‌లో.. శంక‌ర్ భాను డైరెక్షన్‌లో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన సినిమా ‘ఆర్‌డిఎక్స్‌ల‌వ్‌’. ఈ మూవీ ఫస్ట్ నుండీ ఆడియన్స్‌లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. పాయల్ రాజ్‌పుత్ పోస్టర్ రిలీజ్.. ఆ తరువాత వచ్చిన టీజర్‌తో పాయల్‌పై మనసు పారేసుకున్నారు ఆడియన్స్.. ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ యూత్ లో మంచి హీట్ ను పెంచాయి. 

రాజ్‌పుత్, భాను శంకర్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ కథనంతో తయారు చేసుకున్న ‘ఆర్డియక్స్‌లవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా పాయల్ రాజ్‌పుత్‌కు తన డెబ్యూ మూవీలా మంచి పేరు తీసుకొచ్చిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

కథ విషయానికి వస్తే : అందరికి మంచి చేస్తూ… గవర్నమెంట్ పథకాలను ప్రచారం చేస్తూ.. జనాలకోసం పాటు పడే ఓ సామాజిక కర్యకర్త అలివేలు. చంద్రన్న పేటకు చెందిన అలివేలు విజయవాడలో ఉంటూ.. ప్రభుత్వ పథకాల ద్వార సీఎం దృష్టిలో పడి, అతని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటుంది.. ఈ క్రమంలో బాగా పేరు, డబ్బున్న కుర్రాడైన తేజస్ కంచర్ల.. అలివేలును ప్రేమిస్తాడు. అయితే అలివేలు కూడా అతన్ని ప్రేమిస్తుంది. తేజస్ ఫాదర్ నుండి అలివేలుకు బెదిరింపులు వస్తాయి. ఎలాగైనా తన కొడుకుని వదిలి పెట్టాలని లేకుంటే చంపేస్తామని గిరి ప్రకాశ్ నారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ అసలు అలివేలు ఎవరు..? మరి అలివేలు తేజస్ ప్రేమను కంటీన్యూ చేసిందా..?. అసలు అలివేలు సీఎంను ఎందుకు కలవాలి అనుకుంది…? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవలసిందే…

Read Also : వదలడు – రివ్యూ

నటీనటుల విషయానకొస్తే : లేడీ ఓరియెంటెడ్ క్యారక్టర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ సినిమా కోసం 100% బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. లుక్స్ పరంగా ఆకట్టుకుంది. ఇక హీరోగా నటించిన తేజస్ కంచెర్ల ఇంతకు ముందు సినిమాలకన్నా.. మంచి పర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.. ఫైట్స్, డాన్స్ పరంగా ఓకే అనిపించాడు.. ముమైత్ ఖాన్ మోనా డేవిడ్ పాత్రలో బాగా నటించింది. విలన్‌గా నటించిన ఆదిత్య మీనన్ తన హావభావాలతో, డైలాగ్ మాడ్యూలేషన్‌తో బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చి సినిమాకు మంచి సపోర్ట్‌గా నిలిచాడు. ఇక సీఎం పాత్రలో బాపినీడు పరవాలేదని పిస్తారు. సీనియర్ నటుడు నరేష్ తక్కువ నిడివిగల గ్రామస్థుడిగా భావోద్వేగ సన్నివేశాలలో చక్కని నటన కనబరిచారు. ఇక ఆమని.. విధ్యుల్లేఖ తదితరులందరూ.. తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించే ప్రయత్నం చేశారు… 

ఇక టెక్నీషియన్స్ గురించి చూస్తే : దర్శకుడు శంకర్ భాను రొటీన్ కథా కథనాలతో.. సినిమాను పూర్తిగా తప్పుదోవ పట్టించాడు..అవసరం లేని సన్నివేశాలతో విసుగెత్తించాడు. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సబ్జెక్ట్‌తో వచ్చిన మరో సినిమాను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక సంగీత దర్శకుడు రథన్ అందించిన సంగీతం సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు… సినిమాటోగ్రాఫర్ సి.రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఓవరా‌ల్‌గా చెప్పాలి అంటే :  గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పాయిల్ రాజ్‌పుత్‌తో.. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌ను తీసుకుని శంకర్ భాను చేసిన ప్రయత్నం పూర్తిగా విఫల మైంది… నాసిరకం  సన్నివేశాలతో ఆకట్టుకోలేని ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. 

ప్లస్ పాయింట్స్ 

పాయల్ గ్లామర్
సినిమాటో గ్రఫీ 
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ 
కథ, కథనం
డైరెక్షన్ 
మ్యూజిక్ 
నాసిరకం సన్నివేశాలు
కనెక్ట్ కాని ఎమోషన్