Dangerous Apps : మొబైల్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. అధికారిక గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్‌లలో జోకర్ మాల్వేర్ చొరబడిందని..

Dangerous Apps : మొబైల్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

Dangerous Apps

Dangerous Apps : ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. అధికారిక గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్‌లలో జోకర్ మాల్వేర్ చొరబడిందని తెలిపింది. ఈ యాప్స్ కనుక మీ మొబైల్ లో ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని యూజర్లను హెచ్చరించింది.

మాల్వేర్ బారిన పడ్డ యాప్స్..
* కలర్ మెసేజ్
* సేఫ్టీ యాప్ లాక్
* కన్వీనియెంట్ స్కానర్ 2
* పుష్ మెసేజ్ టెక్ట్సింగ్ అండ్ ఎస్ఎంఎస్
* ఎమోజీ వాల్ పేపర్
* సెపరేట్ డాక్ స్కానర్
* ఫింగర్ టిప్ గేమ్ బాక్స్

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

ప్రేడియో తాజా నివేదిక ప్రకారం, ‘కలర్ మెసేజ్’ అనే పాపులర్ యాప్ జోకర్ మాల్వేర్ బారిన పడింది. ఈ యాప్ ను ప్రస్తుతం 5 లక్షలకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఈ యాప్ రష్యన్ సర్వర్లతో అనుసంధానం అయినట్లు ప్రేడియో తన నివేదికలో తెలిపింది.

గూగుల్ ప్లే స్టోర్ లో అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్స్ తో చాలా వరకు పనులు సులభంగా జరిగిపోతున్నాయి. అందుకే యాప్స్ మీద ఆధారపడటం పెరిగిపోయింది. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. యాప్స్ ద్వారా అడ్డంగా దోచేస్తున్నారు. మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అందుకే యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని, వేటిని పడితే వాటిని ఇన్ స్టాల్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని రకాల యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే అవకాశముంది. అంతేకాదు యూజర్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కాజేసేందుకు హ్యాకర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా జోకర్ మాల్వేర్ ను మన ఫోన్లలోకి చొప్పించి వారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జోకర్ మాల్వేర్ బాధితుల సంఖ్య ఎక్కువైంది.

జోకర్ మాల్వేర్ కారణంగా ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్నారు. దీన్ని గుర్తించిన గూగుల్.. ఆ మాల్వేర్ కలిగున్న యాప్స్ ను గుర్తించి తొలగించింది. అయినప్పటికీ, సైబర్ క్రిమినల్స్ కోడ్ మార్చి గూగుల్ సెక్యూరిటీ కళ్లు గప్పి విరుచుకుపడుతున్నారు. ఈ జోకర్ మాల్వేర్ ను 2017లో మొదటిసారి గుర్తించారు.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

జోకర్ మాల్వేర్… వెరీ డేంజరస్..
జోకర్ మాల్వేర్ “ఫ్లీస్‌వేర్” విభాగానికి చెందినది. ఈ మాల్వేర్ మనకు తెలియకుండానే మన అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తుంది. మనకు సంబంధం లేని, అవసరం లేని ప్రీమియం సర్వీసులకు క్లిక్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా సబ్ స్క్రైబ్ చేయిస్తుంది. ఆటోమేటిక్ గా ఆన్ లైన్ యాడ్స్ క్లిక్ చేసి అనుమతి లేకుండానే పెయిడ్ సర్వీసులకు డబ్బులు చెల్లిస్తుంది. మీ బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్ చెక్ చేసేంత వరకు మీ డబ్బు పోయిందన్న విషయాన్ని మీరు గుర్తించలేరు. ఎందుకంటే, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మీ ఫోన్ కు వచ్చే ఓటీపీని కూడా ఆటోమేటిక్ గా రీడ్ చేస్తుంది.