30 బిలయన్ డాలర్లపైనే : అలీబాబా సింగిల్ డే సేల్స్ రికార్డు 

  • Published By: sreehari ,Published On : November 11, 2019 / 01:41 PM IST
30 బిలయన్ డాలర్లపైనే : అలీబాబా సింగిల్ డే సేల్స్ రికార్డు 

చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం, రిటైలర్ అలీబాబా గ్రూపు హోల్డింగ్ లిమిటెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. యానివల్ సింగిల్స్ డే సేల్స్ 30 బిలియన్ల డాలర్ల రికార్డును దాటేసింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. (సాయంత్రం 4.31) ప్రాంతంలో సోమవారం ఈ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ అతిపెద్ద 24 గంటల షాపింగ్ ఈవెంట్ ద్వారా సింగిల్ సేల్స్ రికార్డును సెట్ చేసింది. 

స్థూల వస్తువుల విలువ (GMV) గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే.. అలీబాబా వివిధ షాపింగ్ ప్లాట్ ఫాంలపై సేల్స్ 213.5 బిలియన్ల యువాన్స్ (సుమారు 30.5 బిలియన్ డాలర్లకు)పైగా అధిగమించింది. అలీబాబా వార్షిక సింగిల్స్ డే ఈవెంట్ 11వ ఎడిషన్ సందర్భంగా ఈ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అదే రోజు నవంబర్ 11 కావడంతో డబుల్ 11 షాపింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. 24 గంటల పాటు జరిగే ఈ సేల్స్ ఈవెంట్‌ అర్ధరాత్రి నుంచి సింగపూర్, హాంగ్ కాంగ్ దేశాల్లో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా అలీబాబా.. Tmall మాదిరిగా తమ ఈ-కామర్స్ వెబ్ సైట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. గత ఏడాది కంటే అలీబాబా సింగిల్స్ డే సేల్స్ లో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేశారు. సింగిల్ యూఎస్ షాపింగ్ హాలీడే సమయాల్లోనూ బ్లాక్ ఫ్రైడే లేదా సైబర్ మండే సమయాల్లో కంటే అలీబాబా సింగిల్ సేల్స్ అధిగమించాయి. 

ఈ ఏడాది ఈవెంట్లో సేల్స్ అధికంగా పెరిగేందుకు అలీబాబా.. ఐటమ్స్ పై డిస్కౌంట్లను భారీగా పెంచేసింది. లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే ఎక్కువ సేల్స్ జరిపింది. చైనీస్ ఈ కామర్స్ సైట్లపై సేల్స్ పెరగడానికి లైవ్ స్ట్రీమింగ్ కీలకంగా మారింది. దేశీయ కంపెనీల నుంచి గట్టిపోటీతో పాటు చైనీస్ ఎకానమీ మందగించిన తరుణంలో అలీబాబా కొత్త సింగిల్స్ డే రికార్డును సృష్టించడం విశేషం. అలీబాబా సేల్స్ ప్రారంభమైన తొలి గంటలో GMV 12.01 బిలయన్ డాలర్లను తాకింది. గంటన్నర వ్యవధిలోనే అలీబాబా సేల్స్ మొత్తంగా 2016 సింగిల్స్ డే కంటే అధిగమించాయి.