Tecno Camon 30 Series : భారత్‌కు టెక్నో కెమన్ 30 5జీ సిరీస్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Tecno Camon 30 5G Series : టెక్నో కెమన్ 30 5జీ ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 22,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 26,999కు అందిస్తుంది.

Tecno Camon 30 Series : భారత్‌కు టెక్నో కెమన్ 30 5జీ సిరీస్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Tecno Camon 30 5G Series launched in India, price starts

Tecno Camon 30 5G Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నో కెమన్ 30 5జీ సిరీస్ వచ్చేసింది. ఈ టెక్నో కెమన్ 30 5జీ సిరీస్ మొత్తం రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో ఒకటి కెమన్ 30 5ఫోన్ ఉండగా, మరొకటి టెక్నో కెమెన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్ ఉంది.

కంపెనీ నుంచి లేటెస్ట్ హ్యాండ్‌సెట్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా (HiOS14)పై రన్ అవుతాయి. ప్రీమియర్ మోడల్‌లో మొత్తం 3 50ఎంపీ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఈ 2 హ్యాండ్‌సెట్‌లు 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. కెమన్ 30 సిరీస్‌లోని 2 ఫోన్‌లు 70డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తాయి.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

టెక్నో కెమన్ 30 ధర ఎంతంటే? :
టెక్నో కెమన్ 30 5జీ ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 22,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 26,999కు అందిస్తుంది. రెండు వేరియంట్‌లపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ వేరియంట్లను వరుసగా రూ.19,999 నుంచి రూ.23,999కి తగ్గించవచ్చు. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వచ్చే కెమన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్ రూ. 39,999కి అందుబాటులో ఉంది. అదే రూ.3వేల తగ్గింపుతో ధర రూ.36,999కి పొందవచ్చు. అదనంగా, బ్రాండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కస్టమర్‌లకు రూ.4,999 విలువైన కాంప్లిమెంటరీ ఆఫర్లను కూడా అందిస్తోంది.

టెక్నో కెమన్ 30 స్పెసిఫికేషన్‌లు :
టెక్నో కెమన్ 30 అద్భుతమైన డిజైన్‌లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ (1080 x 2436)తో పెద్ద 6.78-అంగుళాల ఎల్‌టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఈ స్క్రీన్ 120హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మృదువైన స్క్రోలింగ్, గేమ్‌ప్లేను అందిస్తుంది. టచ్ కంట్రోల్ కోసం 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. 1300 నిట్‌ల వరకు ప్రకాశంతో సూర్యకాంతిలో కూడా సులభంగా కనిపిస్తుంది. ఇక డిస్‌ప్లే 100శాతం డీసీఐ-పీ3 కలర్ స్పేస్‌ను కలిగి ఉంది. రియల్ కలర్ డిస్‌ప్లే చేయగలదు. 10-బిట్ కలర్ డెప్త్‌కు సపోర్టు ఇస్తుంది. బిలియన్ కన్నా ఎక్కువ కలర్లను ప్రదర్శిస్తుంది.

కొలతల పరంగా, ఈ టెక్నో ఫోన్ 165.37 x 75.93 x 7.83mm కొలతలు, 199 గ్రాముల బరువు ఉంటుంది. పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఐపీ53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. దుమ్ము, నీటి స్ప్లాష్‌ల నుంచి కొంత ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఐ-ట్రాకింగ్ ఆటో ఫోకస్‌తో కూడిన 50ఎంపీ సెన్సార్, హై-క్వాలిటీ సెల్ఫీలకు బెస్ట్ అని చెప్పవచ్చు. బ్యాక్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 100ఎంపీ మోడ్ షాట్‌లు, 10ఎక్స్ వరకు జూమ్ చేయగల ఏఐ పవర్డ్ క్యూవీజీఏ లెన్స్ ఉన్నాయి. సూపర్ నైట్, టైమ్ లాప్స్, వ్లాగ్ మోడ్‌ల వంటి వివిధ షూటింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.

టెక్నో ఫోన్ 6ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్, ఆక్టా-కోర్ సెటప్‌తో డీ7020 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. వేగవంతమైన సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 16జీబీ లేదా 24జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మల్టీ టాస్కింగ్, యాప్‌లు మీడియాకు తగినంత స్టోరేజీని అందిస్తుంది. బ్యాటరీ 5000ఎంఎహెచ్ యూనిట్, 33డబ్ల్యూ లేదా 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 70డబ్ల్యూ ఛార్జర్‌తో కేవలం 19 నిమిషాల్లో 50శాతం ఛార్జ్‌ని చేరుకుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హెచ్ఐఓఎస్ 14తో రన్ అవుతున్న కేమన్ 30లో డల్‌బై అట్మోస్ సౌండ్, డ్యూయల్ స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మొత్తం ఉయుని సాల్ట్ వైట్, ఐస్లాండ్ బసాల్టిక్ డార్క్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!