China Change 5 Lander : చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా వ్యోమనౌక

చైనా వ్యోమనౌక చంద్రుడిపై నీటిని కనుగొంది. చైనా ల్యాండర్‌ చాంగే-5 చంద్రుడిపై నీటి జాడను కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు.

China Change 5 Lander : చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా వ్యోమనౌక

China’s Chang’e 5 Lunar

China Change 5 Lander: చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అక్కడ నీరు ఉందా? అక్కడ జీవం మనుగడకు అవకాశాలున్నాయా? అనే పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి. దీనికి ఓ క్లారిటీ ఇచ్చింది చైనా వ్యోమోనౌక. చందమామపై నీటి ఆనవాళ్లను కనుగొంది చైనా వ్యోమోనౌక ‘ల్యాండర్‌ చాంగే-5’.

Read more : NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!

చైనా వ్యోమోనౌక ల్యాండర్‌ చాంగే-5 చంద్రుడిపై నీటి జాడను కనుగొంది. చంద్రుడిపై నీటిని ఉపగ్రహాలతో గతంలోనే గుర్తించినా..అక్కడ ల్యాండ్‌ అయి పరిశోధన చేసి గుర్తించడం ఇదే తొలిసారి కావటం విశేషం. టన్ను మట్టికి 120 గ్రాముల పరిమాణం గల నీరు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ల్యాండర్‌ చాంగే-5లో ఉన్న ప్రత్యేక పరికరం సాయంతో ఈ పరిశోధనలు నిర్వహించారు శాస్త్రవేత్తలు.

Read more : చంద్రునిపై నీరు ఉందిక్కడేనంట.. తేల్చేసిన నాసా సైంటిస్టులు!

తేలికైన, వెసిక్యులర్‌ శిలలో 180 పీపీఎం మేర నీరు ఉందని తేలింది. ఈ పరిమాణం భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడి (డ్రైగా)గా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ పద్ధతిలో పరిశీలించినప్పుడు చంద్రుడిపై నీటి జాడను పరిశోధకులు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు చైనా వ్యోమోనౌక చాంగే-5 ల్యాండర్‌.. శిలలు, ఉపరితలంపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై కనిపించే తేమలో ఎక్కువభాగం.. సౌర గాలుల ద్వారా వచ్చినదేనని పరిశోధకులు తెలిపారు.