NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!

శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అత్యంత విలువైన గ్రహశకలాన్ని కనుగొన్నారు. దీని విలువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ విలువేనట. దీన్ని భూమ్మీదకు తెస్తే అందరు బిలియర్లు అవ్వొచ్చట.

NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!

Nasa Asteroid 16 Psyche

NASA Asteroid 16 Psyche : దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో చెప్పగలం..ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చెప్పొచ్చు. కానీ కానీ సౌర కుటుంబంలో అంగారకుడు (మార్స్‌), బృహస్పతి (జూపిటర్‌) గ్రహాల నడుమ చక్కర్లు కొడుతున్న ఓ గ్రహ శకలాని(ఆస్టరాయిడ్‌)కి విలువ ఎంతో చెప్పటం కష్టమని శాస్త్రవేత్తలే అంటున్నారు. ‘బంగారు కొండ’ అని అంటాం కదా..అంతకు మించి విలువైనదట అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో తిరుగాడుతున్న ఓ గ్రహశకలం. నాసా దృషిని ఆకర్షించింది ఈ విలువ కట్టటానికి కూడా వీలులేనంత విలువైన ఆస్టరాయిడ్.

Read more : Psychiatric : అంతరిక్షంలో రూ.లక్షల కోట్ల విలువ చేసే ఆ ముక్క..తవ్వి తేవటానికి సైంటిస్టుల ప్లాన్‌

ఖగోళ శాస్త్రవేత్తలు ‘బంగారు కొండ’గా అభివర్ణిస్తున్న ఆ గ్రహ శకలం పేరు ‘16 సైక్‌’. భూమికి 230 మిలియన్‌ మైళ్ల దూరంలో ఉన్న ‘16 సైక్‌’ను హబుల్‌ టెలిస్కో్‌పతో మొదటిసారి అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు అమెరికాలోని సౌత్‌వె్‌స్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఈ ఆస్టరాయిడ్ ఐరన్‌, నికెల్‌తో నిండి ఉందని తెలిపారు శాస్త్రవేత్తలు. అటువంటి అత్యంత విలువైన ఈ ఆస్టరాయిడ్‌ విలువ 10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చు శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. కానీ అది అంతకంటే ఎక్కువ విలువ కలిగినదేనని అంచనా.ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఇది చాలా చాలా చాలా ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహశకలాన్ని భూమికి తీసుకు రాగలిగితే అది ఎంతో అత్యద్భుతమే అనటంలో ఏమాత్రం సందేహంలేదు. ఎందుకంటే దానితో భూమ్మీదున్న ప్రతీ ఒక్కరు బిలియనీర్లు అవుతారు’ అని అధ్యయన సారథి, శాస్త్రవేత్త ట్రాసీ బెకర్‌ పేర్కొన్నారు.

Read more : Space Debris Collision: అంతరిక్షంలో శిథిలాల ఘర్షణ.. దెబ్బతిన్న చైనా శాటిలైట్!

2022 ఆగస్టులో ఈ ఆస్టరాయిడ్ వద్దకు ఓ వ్యోమోనౌకను పంపాలని నాసా యోచిస్తోంది. ఈ ఆస్టరాయిడ్ ను భూమినుంచి చూడాలంటే ఓ అస్పష్టమైన పొగమంచులా కనిపిస్తోదట.దాని విలువ దాదాపు $94 ట్రిలియన్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే $10 క్విన్టిలియన్ (18 సున్నాలు) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా..ఈ గ్రహశకలం రూ. 72 లక్షల కోట్ల కోట్లు విలువైనదని తేలింది. అంతరిక్షం నుంచి ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని సైంటిస్టులు ప్లాన్‌ చేస్తున్నారు. మరి ‘సైకీ’ అనే గ్రహశకలం విలువే కాదు ఈ పేరు వెనుక కూడా ఓ విశేషముంది.

‘సైకీ’ పేరు వెనుక కథ..
ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్‌ గస్పారిస్‌ 1852 మార్చి 17న ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దానికి పెట్టారు. ప్రేమకు దేవుడైన ఈరోస్ (రోమన్ మన్మథుడు) ను వివాహం చేసుకున్న ఆత్మ యొక్క గ్రీకు దేవత పేరు సైకీ. ఆ పేరునే ఈ గ్రహశకలానికి పెట్టారు. సైంటిస్టులు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపునుంది.

Read more : Kurnool Medical College: క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో విద్యార్ధులకు కరోనా

సైకీ ప్రత్యేకత..
సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైంటిస్టు కేథరిన్‌ డిక్లీర్‌ తెలిపారు. సైకీ మీద ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్కిన్స్‌ టాంటన్‌ అంచనా వేశారు.