Psychiatric : అంతరిక్షంలో రూ.లక్షల కోట్ల విలువ చేసే ఆ ముక్క..తవ్వి తేవటానికి సైంటిస్టుల ప్లాన్‌

అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’ అనే ఓ గ్రహశకలం రూ. 72 లక్షల కోట్ల కోట్లు విలువైనదని సైంటిస్టులు కనుగొన్నారు. ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని సైంటిస్టులు ప్లాన్‌ చేస్తున్నారు. మరి ‘సైకీ’ అనే గ్రహశకలం విలువే కాదు ఈ పేరు వెనుక కూడా ఓ విశేషముంది. అంత విలువైన ఆ సైకీ విశేషాలు ..

Psychiatric : అంతరిక్షంలో రూ.లక్షల కోట్ల విలువ చేసే ఆ ముక్క..తవ్వి తేవటానికి సైంటిస్టుల ప్లాన్‌

Psyche Asteroid

psyche asteroid packed full precious metals : ఈ అనంత సృష్టిలో ఎన్ని వింతలో..ఎన్నెన్ని విలువైన వనరులో. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్న మనిషి ఆ వనరులను తనకు అనుగుణంగా మార్చుకోవటానికి వాడుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. సాధ్యం కానివాటిని కూడా అదుపులోకి తెచ్చుకుని ఉపయోగించుకోవటంలో మనిషి సక్సెస్ అవుతునే ఉన్నాడు. ఈ క్రమంలో మరో అద్భుతమైన అరుదైన అత్యంత విలువైనదానిని దక్కించుకోవటానికి ఆరాటపడుతున్నాడు. ఓ ‘రాతి’ముక్క కోటాను కోట్ల రూపాల విలువ చేస్తుందని తెలిసి దాన్ని తేవటానికి యత్నాలు మొదలుపెట్టారు సైంటిస్టులు. అదేదో భూమ్మీద ఉన్నది కాదు..ఈ అనంత విశ్వంలో వాతావరణం లేని చోట తేలియాడుతోంది. అదేనండీ అంతరిక్షంలో.

అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’ అనే ఓ గ్రహశకలం రూ. 72 లక్షల కోట్ల కోట్లు విలువైనదని తేలింది. అంతరిక్షం నుంచి దాన్ని భూమికి తెచ్చేసుకుంటే 72 పక్కన 19 సున్నాలు పెట్టినంత డబ్బు డబ్బు వస్తుంది. ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని సైంటిస్టులు ప్లాన్‌ చేస్తున్నారు. మరి ‘సైకీ’ అనే గ్రహశకలం విలువే కాదు ఈ పేరు వెనుక కూడా ఓ విశేషముంది. మరి ఆ సైకీ విశేషాలు మీకోసం..మనం కోసం..

సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఈ సైకీ అనే ఆస్టరాయిడ్‌ (గ్రహ శకాలాలు) బెల్ట్‌ ఉంది. ఇతర గ్రహాల తరహాతో పాటు కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. వాటిలో ఈ ‘సైకీ’ అనే గ్రహ శకలం ఒకటి. ఆస్టరాయిడ్లు అంటే చాలా రకాల సైజుల్లో ఉంటాయి. కొన్ని మీటర్ల వ్యాసంలో ఉంటే మరికొన్ని భారీగా ఉంటాయి. మరికొన్ని ఐదు, పది కిలోమీటర్లంత కూడా ఉంటాయి. కానీ సైకీ వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. సైకీ ఆస్టరాయిడ్‌ చాలా చాలా పెద్దది. దీని వ్యాసం ఏకంగా 140 మైళ్లు..అంటే 226 కిలోమీటర్లు. అంటే మన చంద్రుడి పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుందన్నమాట. ఈ సైకీ గ్రహ శకలం భూమికి సుమారు 37 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

‘సైకీ’ పేరు వెనుక కథ..
ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్‌ గస్పారిస్‌ 1852 మార్చి 17న ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దానికి పెట్టారు. ప్రేమకు దేవుడైన ఈరోస్ (రోమన్ మన్మథుడు) ను వివాహం చేసుకున్న ఆత్మ యొక్క గ్రీకు దేవత పేరు సైకీ. ఆ పేరునే ఈ గ్రహశకలానికి పెట్టారు. సైంటిస్టులు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపునుంది.

సైకీ ప్రత్యేకత..
సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైంటిస్టు కేథరిన్‌ డిక్లీర్‌ తెలిపారు. సైకీ మీద ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్కిన్స్‌ టాంటన్‌ అంచనా వేశారు.

భారీ ఆస్టరాయిడ్‌నో ఢీకొని ముక్కలై మధ్యభాగం సైకీ..

సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలోని ఓ గ్రహం మధ్యభాగమే (కోర్‌) ఈ ఆస్టరాయిడ్‌ అని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఏర్పడినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో బరువుగా ఉండే ఇనుము, ఇతర లోహాలు ద్రవస్థితిలో గ్రహం మధ్యభాగం (కోర్‌)లోకి చేరుతాయి. మన భూమి, అంగారకుడు, ఇతర గ్రహాల మధ్యభాగంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర లోహాలు ఉంటాయి. అలాంటి ఓ గ్రహం వేరే గ్రహాన్నో, భారీ ఆస్టరాయిడ్‌నో ఢీకొని ముక్కలై ఉంటుందని.. దాని మధ్యల ముక్కే ఈ ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ అని సైంటిస్టులు చెప్తున్నారు. దీనిని పరిశీలించడం ద్వారా గ్రహాలు ఏర్పడినప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చని.. కోర్‌ ఎలా ఏర్పడుతుంది? దాంట్లో ఏమేమి ఉంటాయి? అనేది పరిశోధనల ద్వారా గుర్తించవచ్చని అంటున్నారు.

2022 లోనే నాసా వ్యోమనౌక ప్రయాణం
సైకీ ఆస్టరాయిడ్‌పై విస్తృతంగా పరిశోధన చేయడం కోసం నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకను పంపనున్నారు. 2022 మార్చిలో అమెరికాలోని ఫ్లారిడా నుంచి ఈ ‘సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌’ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యోమోనౌక సుమారు మూడున్నరేళ్లు ప్రయాణించి సైకీని చేరుకుంటుంది. అంటే 2022లో బయలుదేరితే అది సైకీని 2026లో చేరుకుంటుందన్నమాట. అలా వెళ్లిన వ్యోమోనౌక రెండు సంవత్సరాలపాటు సైకీ చుట్టు చక్కర్లు కొట్టి..పరిశోధనలు చేస్తుంది.వాటిని సైంటిస్టులకు చేరవేస్తుంది.