Karthk Aaryan : 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా? బాలీవుడ్ హీరోకి నెటిజన్ ఆఫర్..
ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు కార్తిక్. ఆ వీడియో కింద లేడీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ 20 కోట్లిస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా ఆర్యన్ అని......
Karthk Aaryan : బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది కార్తిక్ కి. కార్తిక్ ఆర్యన్ అంటే యంగ్ లేడీ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. గతంలో కొంత మంది అమ్మాయిలు కార్తీక్ ని కలవాలని వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కార్తీక్ ఎక్కడికి ఐనా వస్తున్నాడు అని తెలిస్తే అమ్మాయిలు ముందుంటారు. ఇక ఇటీవల కార్తీక్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నాడు.
ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు కార్తిక్. ఆ వీడియో కింద లేడీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ 20 కోట్లిస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా ఆర్యన్ అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్ ఆర్యన్ కూడా రిప్లై ఇచ్చాడు. సరే ఎప్పుడు చేసుకుందాం? అని అడిగాడు. దీంతో ఆ నెటిజన్ ఇప్పుడే వచ్చేయ్ పెళ్లి వెంటనే చేసుకుందాం అని రిప్లై ఇచ్చింది. కామెంట్స్ లో ఈ చాటింగ్ కాసేపు జరిగింది. ఇది చూసిన మరికొందరు అమ్మాయిలు కూడా మేము కూడా డబ్బులు ఇస్తాము మమ్మల్ని కూడా పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో కార్తీక్ ఆర్యన్ సరదాగా వేలంపాట వేద్దామా అని కామెంట్ పెట్టాడు.
BiggBoss Non Stop : మళ్ళీ కొట్టుకున్న బిగ్‌బాస్ సభ్యులు.. సరయు, శ్రీరాపాక ఒకరిపై ఒకరు పడిపోయి..
గతంలో కూడా ఓ నెటిజన్ నా కామెంట్ కి రిప్లై ఇస్తే 10 లక్షలు ఇస్తా అని కామెంట్ పెట్టడంతో దానికి రిప్లైగా సరే 10 లక్షలు పంపు అని కామెంట్ పెట్టాడు సరదాగా. ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ లేడీ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు కార్తిక్ ఆర్యన్.