Diet : వయస్సు 40దాటితే ఆహారంలో!

40 ఏళ్లు దాటిన తరువాత ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.

Diet : వయస్సు 40దాటితే ఆహారంలో!

Diet : వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. వయస్సు 40 దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోతే అనారోగ్య సమస్యలు ముప్పు అధికంగా ఉంటుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. వయసుకు తగ్గట్టు ఆహారం తీసుకోకపోతే జీర్ణంకాక శరీరంలో కొవ్వులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.

40 ఏళ్లు దాటిన తరువాత ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. రోజూ వారీ ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్లాక్స్, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, సోయా ప్రొడక్స్ట్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. గుడ్ కొలెస్ట్రాల్‌నే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అని పిలుస్తారు. గుడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారినపడే రిస్క్ తగ్గుతుంది

తృణధాన్యాల్లో ఫైబర్‌తో పాటు వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు దరిచేరవు. ఓట్స్, రెడ్ రైస్ రూపంలో తృణ ధాన్యాలను తీసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రోటీన్ డైట్‌లో పాలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్, డ్రాగన్ ఫ్రూట్స్, సలాడ్స్ ను తీసుకోవాలి. వీటిని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. గోధుమ రొట్టే, బీన్స్, గంజి, చిక్కళ్లు, పాస్తా వంటి వాటిని తీసుకోవాలి.