Britain’s Queen Elizabeth II health: వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II.. కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ఆందోళన

సుదీర్ఘకాలంగా బ్రిటన్‌ రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్‌-II (96) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇవాళ ఉదయం ఎలిజబెత్‌-2 ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది.

Britain’s Queen Elizabeth II health: వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II.. కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ఆందోళన

Britain's Queen Elizabeth-II health

Britain’s Queen Elizabeth-II health: సుదీర్ఘకాలంగా బ్రిటన్‌ రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్‌-II (96) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇవాళ ఉదయం ఎలిజబెత్‌-2 ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది.

ఎలిజబెత్‌-II ఆరోగ్యంపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ‘‘రాణి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె ప్రస్తుతం బల్మోరల్ కోటలో ఉన్నారు’’ అని చెప్పారు. కాగా, ఆమెకు నిన్నటి నుంచే ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తోంది. నిన్న ఎలిజబెత్‌-II కీలక సమావేశాలను వాయిదా వేశారు. నిన్న ఆమె ప్రివీ కౌన్సిల్ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొనాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఎలిజబెత్‌-II ను రెండు రోజుల క్రితమే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కలిసిన విషయం తెలిసిందే.

ఎలిజబెత్‌-II కు బోరిస్ జాన్సన్ అధికారికంగా రాజీనామా లేఖను సమర్పించగా, అందుకు ఆమె అంగీకరించారు. అనంతరం ఎలిజబెత్‌-IIను లిజ్ ట్రస్ కలిసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఎలిజబెత్‌-2 ఆరోగ్య పరిస్థితిపై లిజ్ ట్రస్ స్పందించారు. ‘‘బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించిన ఈ విషయం పట్ల దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో రాణి, ఆమె కుటుంబ సభ్యుల గురించే నాతో పాటు దేశ ప్రజల ఆలోచనలు ఉన్నాయి’’ అంటూ లిజ్ ట్రస్ ట్వీట్ చేశారు.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్